విజయవాడలో (Vijayawada) భారీవర్షం విళయం సృష్టిస్తున్నది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షంతో (Rains) నగరం అతలాకుతలమైంది. ఒక పక్క కుండపోత వర్షం మరోవైపు పొంగిన రోడ్లు జలమయమైన రహదారులుతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వర్షపు నీటితో లోతట్టు ప్రాంతాలు తటాకాలను తలపిస్తున్నాయి. గత 20 ఏళ్ల చరిత్రలో ఎన్నడూలేనంతగా బెజవాడ నగరం బెంబేలెత్తింది. భారీ వర్షాలకు విజయవాడ మంగళగిరి రహదారిపై చెట్లు విరిగిపడ్డాయి , కరెంట్ స్తంభాలు నేలకొరిగాయి. రోడ్డుపై రాకపోకలు నిలిచిపోయాయి. విజయవాడలోని న్యూ రాజరాజేశ్వరి పేట ప్రస్తుత వరద పరిస్థితి. జలదిగ్బంధంలో విజయవాడ.. గడిచిన 20 ఏండ్లలో ఎన్నడూ చూడనంత వర్షం.. ఆరుగురు మృతి.. నీటిలో తేలియాడుతున్న బస్సులు (వీడియో)
Here's Videos
భారీ వర్షాలకు విజయవాడ మంగళగిరి రహదారిపై విరిగిపడిన చెట్లు , కరెంట్ స్తంభాలు.
రోడ్డుపై నిలిచిపోయిన రాకపోకలు. pic.twitter.com/LRjQAWYmti
— ChotaNews (@ChotaNewsTelugu) September 1, 2024
విజయవాడలోని న్యూ రాజరాజేశ్వరి పేట ప్రస్తుత వరద పరిస్థితి. pic.twitter.com/bgkIU43tg7
— ChotaNews (@ChotaNewsTelugu) September 1, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)