
Vijayawada, Sep 1: విజయవాడలో (Vijayawada) భారీవర్షం విళయం సృష్టిస్తున్నది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షంతో (Rains) నగరం అతలాకుతలమైంది. ఒక పక్క కుండపోత వర్షం మరోవైపు పొంగిన రోడ్లు జలమయమైన రహదారులుతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వర్షపు నీటితో లోతట్టు ప్రాంతాలు తటాకాలను తలపిస్తున్నాయి. గత 20 ఏళ్ల చరిత్రలో ఎన్నడూలేనంతగా బెజవాడ నగరం బెంబేలెత్తింది. మొగల్రాజపురం సున్నపుబట్టీల సెంటర్ వద్ద కొండచరియలు విరిగిపడి ఆరుగురు మృతి చెందారు. మరో నలుగురు గాయపడ్డారు.
విజయవాడలో వర్ష బీభత్సం.. వరద నీటిలో నిలిచిన బస్సులు.#Vijayawada #Heavyrains #Chotanews pic.twitter.com/wTlAoMNfrt
— ChotaNews (@ChotaNewsTelugu) September 1, 2024
నీటిలో బస్సులు
విజయవాడలోని దాదాపు అన్ని ప్రాంతాలు జలమయం అయ్యాయి. కార్లు, బస్సులు రహదారులపై నిలిచిన వరదలో చిక్కుకుపోయి మొరాయించాయి. ఇక ద్విచక్ర వాహనదారుల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. అండర్ గ్రౌండ్ వంతెనలు నీటితో నిండిపోయాయి. విజయవాడ నగరం జలదిగ్బంధంలో ఉండటంతో బస్సు సర్వీసులు రద్దయ్యాయి. ఆర్టీసీ, ప్రైవేటు ట్రావెల్స్, సహా లారీలు ఎక్కడి కక్కడ నిలిచిపోయాయి. బస్టాండ్ నుంచి పలు ప్రాంతాలకు వెళ్లే బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.