Suryapet Road Accident: సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం, కూలీలతో వెళ్తున్న ఆటోను ఢీకొట్టిన బస్సు, ముగ్గురు అక్కడికక్కడే మృతి, మరో 12 మందికి గాయాలు
సూర్యాపేట జిల్లా కేంద్రానికి దగ్గరలో ఈ రోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మోతేకు దగ్గరలో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై మధిర డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కూలీలతో వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలోని ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.
సూర్యాపేట జిల్లా కేంద్రానికి దగ్గరలో ఈ రోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మోతేకు దగ్గరలో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై మధిర డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కూలీలతో వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలోని ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో 12 మందికి గాయాలయ్యాయి. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. కుత్బుల్లాపూర్ లో భారీ అగ్నిప్రమాదం, అపార్ట్ మెంట్లో చెలరేగిన మంటలు, సకాలంలో స్పందించడంతో తప్పిన ప్రాణనష్టం (వీడియో ఇదుగో)
మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు. ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం 15 మంది ఉన్నారని, వారంతా కూలీ పనుల కోసం వెళ్తుండగా ప్రమాదం బారినపడ్డారని పోలీసులు తెలిపారు. మునగాల మండలం రామ సముద్రానికి చెందిన కూలీలు మోతె మండలం బుర్కచర్లలో మిరప పనులకు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)