School Bus Overturns in Hyd: వీడియో ఇదిగో, కాటేదాన్‌లో ప్రైవేట్‌ పాఠశాల బస్సు బోల్తా, 30 మంది విద్యార్థులకు గాయాలు, పలువురి పరిస్థితి విషమం

హైదరాబాద్ నగరంలోని కాటేదాన్‌లో ఓ ప్రైవేట్‌ పాఠశాల బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురు చిన్నారి విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. హుటాహుటిన స్కూల్‌ యాజమాన్యం గాయపడిన విద్యార్థులను సమీప ఆస్పత్రులకు తరలించింది.

School Bus Overturns in Hyderabad Katedhan 30 Students Injured

హైదరాబాద్ నగరంలోని కాటేదాన్‌లో ఓ ప్రైవేట్‌ పాఠశాల బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురు చిన్నారి విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. హుటాహుటిన స్కూల్‌ యాజమాన్యం గాయపడిన విద్యార్థులను సమీప ఆస్పత్రులకు తరలించింది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 40 మంది విద్యార్థులు ఉండగా.. 30 మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బ్రేక్‌ ఫెయిల్‌ కావడంతోనే బస్సు అదుపు తప్పినట్లు స్థానికులు చెబుతున్నారు. పోలీసులు, అధికారులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.  వీడియో ఇదిగో, పోలీస్ వాహనం ఢీకొని వ్యక్తి మృతి, న్యాయం చేయాలంటూ మృతదేహంతో బంధువులు రోడ్డుపై ఆందోళన

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now