పోలీస్ వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన నల్గొండ జిల్లాలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. అనుముల మండలంలోని పంగవానికుంట గ్రామానికి చెందిన బైరి చెన్నయ్య (66) సోమవారం రాత్రి ఇంటి నుంచి జాతీయ ప్రధాన రహదారి దాటుతుండగా సాగర్ నుండి నల్లగొండ వెళ్తున్న పోలీస్ కమ్యూనికేషన్ వాహనం ఢీ కొట్టింది. దీంతో చెన్నయ్య అక్కడికక్కడే మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించారు. విషయం తెలుసుకున్న సీఐ జనార్దన్ గౌడ్ ఎస్సె సతీష్ రెడ్డిలు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద వివరాలను తెలుసుకు న్నారు. మృతునికి కుమారుడు కుమార్తె ఉన్నారు.  శభాష్ ములుగు జిల్లా పోలీస్, చనిపోయాడనుకున్న వ్యక్తికి సీపీఆర్ , కానిస్టేబుళ్లను అభినందించిన ఎస్పీ...వీడియో

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)