Sitarama Project Trial Run Success Video: సీతారామ ప్రాజెక్టు మోటార్ల ట్రయల్ రన్ సక్సెస్, తమ ఖాతాలో వేసుకున్న బీఆర్ఎస్, వీడియో ఇదిగో..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సీతారామ ప్రాజెక్టు మోటార్ల ట్రయల్ రన్ సక్సెస్ అయింది. ఉదయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు వద్ద మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అధికారులతో కలిసి మోటార్ల ట్రయల్ రన్‌ను పర్యవేక్షించారు
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ట్టిన సీతారామ ప్రాజెక్టు మోటార్ల ట్రయల్ రన్ సక్సెస్ అయింది. ఉదయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు వద్ద మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అధికారులతో కలిసి మోటార్ల ట్రయల్ రన్‌ను పర్యవేక్షించారు. ట్రయల్ రన్ విజయవంతం కావడంతో మంత్రి తుమ్మల హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టుతో ఉమ్మడి ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లోని 10 లక్షల ఎకరాలకు సాగు నీరు అందనుంది.
సీతారామ ప్రాజెక్టుకు 2016 ఫిబ్రవరి 16న మాజీ సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. గోదావరి నదిపై దుమ్ముగూడెం దిగువన సీతమ్మ సాగర్ బ్యారేజ్ నిర్మాణం చేసి 70 టీఎంసీల సామర్థ్యంతో కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో 10 లక్షల ఎకరాలకు సాగు నీరు అందేలా ఈ ప్రాజెక్టు రూపకల్పన చేశారు. రూ. 17 వేల కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టు పనులు చేపట్టారు. కాగా, ఈ ప్రాజెక్టు పనులు కేసీఆర్ హయాంలోనే 70 శాతం పూర్తయ్యాయి.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)