Telangana: ఆదివాసి యువతిపై అత్యాచారయత్నం, గాయపడ్డ బాధితురాలిని పరామర్శించిన మంత్రి సీతక్క, వీడియో ఇదిగో..

ప్రస్తుతం బాధితురాలికి హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మంత్రి సీతక్క బాధితురాలి వద్దకు వెళ్లి పరామర్శించారు. నిందితులు ఎవరైనా సరే ఉపేక్షించేది లేదని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు.

Minister Seethakka (Photo-Video Grab)

కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్ మండలంలో ఆదివాసీ యువతిపై షేక్ మగ్ధూం అనే ఆటో డ్రైవర్ లైంగిక దాడికి యత్నించిన ఘటనపై స్థానికంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఆదివాసీ యువతిపై జరిగిన అఘాయిత్యాన్ని నిరసిస్తూ జైనూర్ పట్టణంలో ఈరోజు ఆదివాసీలు బంద్‌కు పిలుపునిచ్చారు. ప్రస్తుతం బాధితురాలికి హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మంత్రి సీతక్క బాధితురాలి వద్దకు వెళ్లి పరామర్శించారు.

నిందితులు ఎవరైనా సరే ఉపేక్షించేది లేదని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇందుకు సంబంధించి సీతక్క ఓ వీడియోను కూడా విడుదల చేశారు. దీంతో ఆదివాసీ సంఘాలు శాంతించాయి.ఎస్టీ సంక్షేమ శాఖ తరఫున లక్ష రూపాయల పరిహారాన్ని కుటుంబ సభ్యులకు సీతక్క అందజేశారు.

ఆదివాసీ యువతిపై అత్యాచారయత్నం, ఆసిఫాబాద్ జిల్లాలో బంద్‌కు పిలుపునిచ్చిన ఆదివాసీలు, 144వ సెక్షన్ విధింపు

Here's Video

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement