Telangana: వీడియో ఇదిగో, డీఎస్సీ వాయిదా వేయకుంటే నాకు చావే గతి, సీఎం రేవంత్ రెడ్డికి విన్నవించుకున్న మహిళా అభ్యర్థి
సీఎం రేవంత్ రెడ్డికి నమస్కారం. డీఎస్సీ సిలబస్ ఎక్కువగా ఉంది. టెట్, డీఎస్సీ మధ్య 20 రోజుల సమయమే ఇచ్చారు. మీ కాళ్లు మొక్కుతా.. దండం పెడుతా.. డీఎస్సీ వాయిదా వేయండి సర్.. నా భర్త నా మీద నమ్మకం పెట్టుకున్నాడు. సమయం లేనందున సిలబస్ పూర్తి చేయడం కష్టం
తెలంగాణ వ్యాప్తంగా డీఎస్సీ వాయిదా వేయాలంటూ అభ్యర్థుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. షెడ్యూల్ ప్రకారమే డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తామని తెలంగాణ విద్యాశాఖ స్పష్టం చేసింది.ఈ నేపథ్యంలో పలువురు డీఎస్సీ అభ్యర్థులు పలు విధాలుగా నిరసన తెలుపుతున్నారు. తాజాగా మహిళా అభ్యర్థి వీడియో ద్వారా డీఎస్సీ వాయిదా వేయాలని సీఎం రేవత్ రెడ్డికి విన్నవించుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్తత, మీడియా రిపోర్టర్ పై పోలీసుల దాడి, వీడియో సోషల్ మీడియాలో వైరల్
వీడియోలో ఆమె మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డికి నమస్కారం. డీఎస్సీ సిలబస్ ఎక్కువగా ఉంది. టెట్, డీఎస్సీ మధ్య 20 రోజుల సమయమే ఇచ్చారు. మీ కాళ్లు మొక్కుతా.. దండం పెడుతా.. డీఎస్సీ వాయిదా వేయండి సర్.. నా భర్త నా మీద నమ్మకం పెట్టుకున్నాడు. సమయం లేనందున సిలబస్ పూర్తి చేయడం కష్టం. నాకు బతకాలనిపిస్తలేదు. పోస్టు పోన్ చేయండి సర్ మీ కాళ్లు మొక్కుతా. టీఆర్ఎస్ వాళ్లు ఎవరూ మా వెనుకాల లేరు. సొంతంగానే నిరసనలు తెలుసుతున్నాం అని ఆమె వీడియోలో కన్నీరు పెట్టుకున్నారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)