ఉస్మానియా యూనివ‌ర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది. డీఎస్సీ వాయిదా వేయాల‌ని నిరుద్యోగ అభ్య‌ర్థులు నిరసనకు దిగారు. వారికి మ‌ద్ద‌తుగా నిర‌స‌న తెలుపుతున్న బీఆర్ఎస్వీ నాయకుల ప‌ట్ల పోలీసులు అనుచితంగా ప్ర‌వ‌ర్తించారు.వారిపై దాడి చేశారు. అనంత‌రం పోలీసు వ్యాన్‌లో ఎక్కించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో దర్శరమిచ్చాయి.ఓయూలోని ఎన్ఆర్ఎస్ హాస్ట‌ల్ వ‌ద్ద బీఆర్ఎస్వీ నాయ‌కుల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  టీజీపీఎస్సీ కార్యాలయం ముట్టడించిన నిరుద్యోగ జేఏసీ నేతలు, పలువురిని అరెస్ట్ చేసిన పోలీసులు

బీఆర్ఎస్ విద్యార్థి విభాగానికి చెందిన సుమారు 300 మంది విద్యార్థుల‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఉస్మానియా యూనివ‌ర్సిటీ మెయిన్ లైబ్ర‌రీ వ‌ద్ద మీడియా ప్ర‌తినిధుల ప‌ట్ల పోలీసులు అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించారు. డీఎస్సీ అభ్య‌ర్థుల ఆందోళ‌న‌ల‌ను క‌వ‌రేజ్ చేసేందుకు వెళ్లిన జీ తెలుగు రిపోర్ట‌ర్ ప‌ట్ల పోలీసులు అమ‌ర్యాద‌గా ప్ర‌వ‌ర్తించారు. జీ తెలుగు రిపోర్ట‌ర్ చొక్కా ప‌ట్టుకుని లాక్కెళ్లారు. నేను జ‌ర్న‌లిస్టును.. మీ ప‌ని మీరు చేసుకోండి.. మా ప‌ని మేం చేసుకుంటాం అంటుంటే కూడా పోలీసులు వినిపించుకోలేదు. ఆ రిపోర్ట‌ర్‌ను బ‌ల‌వంతంగా పోలీసు వాహ‌నంలో ఎక్కించారు పోలీసులు.  ఈ ఘటనపై ఎక్స్ వేదికగా కేటీాఆర్ మండిపడ్డారు.

Here's KTR Retweet Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)