Telangana: వీడియో ఇదిగో, ఆర్టీసీ బస్సులో వెళుతుండగా గర్భిణికి పురిటి నొప్పులు, బస్సులోనే ఆమెకు పురుడు పోసిన తోటి మహిళా ప్రయాణికులు
తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలో ఆర్టీసీ బస్సులో పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణికి తోటి మహిళా ప్రయాణికులు సాయం చేసి పురుడు పోసి మానవత్వం చాటుకున్నారు
తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలో ఆర్టీసీ బస్సులో పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ తోటి మహిళా ప్రయాణికులు సాయం చేసి పురుడు పోసి మానవత్వం చాటుకున్నారు. జిల్లాలోని కేటి దొడ్డి మండలం గువ్వలదిన్నె గ్రామానికి చెందిన మరియమ్మకు కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలోని బావి దొడ్డి గ్రామానికి చెందిన నరేశ్ తో వివాహం జరిగింది. మరియమ్మ గర్భిణి కాగా ఓ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లేందుకు రాయచూర్ నుంచి గద్వాల్‌కు వెళ్లే తెలంగాణ ఆర్టీసీ బస్సు ఎక్కారు.
ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తుండగా మరియమ్మకు పురిటి నొప్పులు వచ్చాయి. ఈ విషయాన్ని గమనించిన తోటి ప్రయాణికులు డ్రైవర్‌కు చెప్పి బస్సును రోడ్డు పక్కన నిలిపివేశారు. ఆమెకు పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో బస్సులోనే మహిళా ప్రయాణికులంతా కలిసి ఆమెకు పురుడు పోశారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆర్టీసీ సిబ్బంది 108 అంబులెన్స్‌లోని వారిని గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికు తరలించారు. ప్రస్తుతం తల్లీబిడ్డలు క్షేమం ఉన్నారు.
Woman gives birth to baby on TGSRTC bus