కరీంనగర్ బస్ స్టేషన్‌లో పుట్టిన చిన్నారికి టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో జీవిత కాలం ఉచితంగా ప్రయాణించేలా బస్ పాస్‌ను అందిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ) ప్రకటించింది. ఆర్టీసీ బస్సులు, బస్ స్టేషన్‌లో జన్మించే చిన్నారులకు జీవిత కాలం ఫ్రీగా బస్ పాస్ ఇవ్వాలని గతంలో యాజమాన్యం తీసుకున్న నిర్ణయం మేరకు కరీంనగర్ బస్ స్టేషన్‌లో పుట్టిన ఆడపిల్లకు లైఫ్ టైం ఫ్రీగా బస్‌పాస్‌ను మంజూరు చేస్తున్నట్లు తెలిపింది.
పురిటినొప్పులతో కరీంనగర్ బస్టాండ్‌లో బాధపడుతున్న గర్భిణికి చీరను అడ్డుకట్టి కాన్పు చేసి మానవత్వం చాటిన తమ సిబ్బందిని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం అభినందించింది. సంస్థ ఉన్నతాధికారులతో కలిసి టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ బుధవారం హైదరాబాద్ బస్ భవన్‌లో వారిని సన్మానించారు. తెలంగాణలో ఒకేసారి భారీ సంఖ్యలో ఐపీఎస్ లకు స్థానచలనం.. ఏకంగా 28 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ... వివరాలు ఇవిగో!
జూన్ 16న కుమారి అనే గర్భిణీ, తన భర్తతో కలిసి భద్రాచలం బస్సు ఎక్కేందుకు కరీంనగర్ బస్టాండ్‌కు వచ్చారు. బస్టాండ్‌లో ఉన్న సమయంలో ఆమెకు పురిటి నొప్పులు ఎక్కువ అయ్యాయి.
ఆ చిన్నారికి జీవితాంతం బస్ ఫ్రీ
కరీంనగర్ బస్ స్టేషన్ లో పుట్టిన చిన్నారికి జీవితకాలం ఉచిత బస్ పాస్.. ప్రకటించిన టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం
డెలివరీ చేసి మానవత్వం చాటిన ఆర్టీసీ సిబ్బందికి ఘన సన్మానం#hyderabad #tgsrtc #chotanews @TGSRTCHQ #karimnagar pic.twitter.com/q1LRv3ufr5
— ChotaNews (@ChotaNewsTelugu) June 19, 2024
దీన్ని గమనించిన ఆర్టీసీ సిబ్బంది 108కి ఫోన్ చేశారు. కుమారికి నొప్పులు ఎక్కువ కావడంతో అక్కడ ఉన్న ఆర్టీసీ మహిళా సిబ్బంది చీరలను అడ్డుపెట్టి నార్మల్ డెలివరీ చేశారు. కుమారికి ఆడపిల్ల పుట్టింది. అనంతరం వారిని అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు. తల్లీబిడ్డా ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.