Telugu States Floods: భారీ వరదలు, తెలుగు రాష్ట్రాలకు హీరో సిద్దు జొన్నలగడ్డ రూ. 30 లక్షలు సాయం, వరదలు ముంచెత్తడం బాధాకరమని ట్వీట్
వరద బాధితులకు తన వంతు సహకారంగా రూ.30 లక్షల ఆర్థిక సాయాన్ని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రి వరద సహాయ నిధికి ప్రకటిస్తున్నాని తెలిపారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా భారీ ఆస్థి ప్రాణ జరిగింది. కొన్ని చోట్ల ప్రజలు తమ ఆవాసాలను కోల్పోయారు. తినడానికి తిండి తాగటానికి మంచి నీళ్లు లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వారిని ఆదుకునేందుకు తెలుగు సినీ పరిశ్రమ పెద్ద హీరోల నుంచి చిన్న హీరోల వరకు మేము సైతం అంటూ ముందడుగు వేసింది. ఎన్టీఆర్ బాటలో విశ్వక్ సేన్.. వరద బాదితులకు ఆసరా.. ఒక్కో రాష్ట్రానికి రూ. 5 లక్షల చొప్పున సాయం
యంగ్ టాలెంటెడ్ హీరో సిద్దు జొన్నలగడ్డ రెండు తెలు రాష్ట్రాల ప్రజల కోసం తన వంతు సాయాన్ని ప్రకటించారు. వరద బాధితులకు తన వంతు సహకారంగా రూ.30 లక్షల ఆర్థిక సాయాన్ని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రి వరద సహాయ నిధికి ప్రకటిస్తున్నాని తెలిపారు. (రూ.15లక్షలు తెలంగాణ వరద సహాయ నిధికి, మరో రూ.15లక్షలు ఆంధ్రప్రదేశ్ వరద సహాయ నిధికి అందించారు). ఈ మేరకు తెలుగు రాష్ట్రాల్లో వరదలు ముంచెత్తడం బాధాకరమైన విషయం. ప్రస్తుతం ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూస్తుంటే..ఇంకెవ్వరికే ఇలాంటి ఆపద రాకుండదని విచారం వ్యక్తం చేశారు
Here's Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)