TSRTC: స్కూటిపై వెళుతూ ఆర్టీసీ బస్సును కాలితో నెడుతున్నట్లుగా యువకుడి వీడియో వైరల్, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్

TSRTC MD వీసీ సజ్జనార్‌ సోషల్‌ మీడియా వేదికగా ఓ యువకుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వీడియోలో స్కూటీపై వెళ్తున్న యువకుడు.. బస్సును వెనుక నుంచి కాలితో నెడుతున్నట్లుగా ఉంది. ఇది కాస్త వైరల్‌ కావడంతో.. సజ్జనార్‌ స్పందించారు.

Youth Stunt Video (Photo-Twitter)

TSRTC MD వీసీ సజ్జనార్‌ సోషల్‌ మీడియా వేదికగా ఓ యువకుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వీడియోలో స్కూటీపై వెళ్తున్న యువకుడు.. బస్సును వెనుక నుంచి కాలితో నెడుతున్నట్లుగా ఉంది. ఇది కాస్త వైరల్‌ కావడంతో.. సజ్జనార్‌ స్పందించారు. ప్రమాదాల బారిన పడి.. మీ తల్లిదండ్రులకు శోకం మిగల్చొద్దని సూచిస్తూ ట్వీట్‌ చేశారాయన. అంతేకాదు.. చట్టప్రకారం.. ఇలాంటి వారిపై చర్యల కూడా ఉంటాయని తెలిపారు.

మిథానీ డిపోకు చెందిన ఓ బస్సుపై సదరు యువకుడు స్టంట్లు చేస్తూ వీడియో తీసుకున్నాడు.దీనిపై సజ్జనార్ తన సొంత అకౌంట్‌నుంచి.. వెర్రి వేయి విధాలు అంటే ఇదే! సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం రోడ్లపై ఇలాంటి పిచ్చి వేషాలు వేయకండి. ప్రమాదాల బారినపడి మీ తల్లితండ్రులకు శోకాన్ని మిగల్చకండి అంటూ ట్వీట్‌ చేశారు. ఆపై ఆర్టీసీ ఎండీ హోదాలో మరో ట్విటర్‌ అకౌంట్‌ నుంచి.. ఇలాంటి చర్యలకు కఠిన చర్యలు ఉంటాయని మరో ట్వీట్‌ చేశారాయన.

Here's VIdeo

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement