TSRTC MD Sajjanar: ఆర్టీసీ డిపోల‌ మూసివేత అవాస్తవం, భూములు అమ్మే ఆలోచ‌న ఆర్టీసీకి లేదని తెలిపిన ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌నార్

హైద‌రాబాద్‌లోని ప‌లు ఆర్టీసీ డిపోల‌ను మూసివేస్తున్న‌ట్లు ప‌లు మీడియాల్లో వ‌చ్చిన క‌థ‌నాల‌పై ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌నార్ స్పందించారు. ఆర్టీసీ డిపోల మూసివేత‌పై వ‌స్తున్న వార్త‌లు అవాస్త‌వం అని స‌జ్జ‌నార్ స్ప‌ష్టం చేశారు. భూములు అమ్మే ఆలోచ‌న ఆర్టీసీకి లేదు. ఉద్యోగుల సంక్షేమం ఆర్టీసీ చాలా ముఖ్యం అని తేల్చిచెప్పారు.

TSRTC MD VC Sajjanar (Photo-Twitter)

హైద‌రాబాద్‌లోని ప‌లు ఆర్టీసీ డిపోల‌ను మూసివేస్తున్న‌ట్లు ప‌లు మీడియాల్లో వ‌చ్చిన క‌థ‌నాల‌పై ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌నార్ స్పందించారు. ఆర్టీసీ డిపోల మూసివేత‌పై వ‌స్తున్న వార్త‌లు అవాస్త‌వం అని స‌జ్జ‌నార్ స్ప‌ష్టం చేశారు. భూములు అమ్మే ఆలోచ‌న ఆర్టీసీకి లేదు. ఉద్యోగుల సంక్షేమం ఆర్టీసీ చాలా ముఖ్యం అని తేల్చిచెప్పారు. ఆర్టీసీ బ‌స్సు ఛార్జీల‌ను పెంచాల్సిన అవ‌స‌రం ఉంది అని స‌జ్జ‌నార్ పేర్కొన్నారు. ఎంజీబీఎస్‌లో ఆర్టీసీ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన‌ మెగా ర‌క్త‌దాన శిబిరాన్ని ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌నార్, హైద‌రాబాద్ క‌లెక్ట‌ర్ శ‌ర్మ‌న్ క‌లిసి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఎంజీబీఎస్ స్టాళ్ల‌లో వ‌స్తువుల ధ‌ర‌పై స‌జ్జ‌నార్ ఆరా తీశారు. అధిక ధ‌ర‌ల‌కు అమ్మితే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఏదైనా దుకాణంపై 3 కంటే ఎక్కువ ఫిర్యాదులుంటే శాశ్వ‌తంగా మూసివేయాల‌ని ఆదేశించారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now