Telangana Road Accident: వీడియో ఇదిగో, రోడ్డు ప్రమాదంలో చిక్కుకున్న యువతి ప్రాణాలను కాపాడిన బండి సంజయ్, చికిత్సకు అయ్యే ఖర్చును తానే చెల్లిస్తానని భరోసా
హుజురాబాద్ నియోజకవర్గం సింగాపూరం సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురైన యువతి..లారీ కింద ఇరుక్కుపోయింది. మానకొండూర్ మండలం ఖెల్లడ గ్రామానికి చెందిన యువతి దివ్య శ్రీ సింగాపూరం సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురైంది. ములుగు పర్యటనకు వెళ్తు ప్రమాదాన్ని చూసి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తన వాహనాన్ని ఆపారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ మానవత్వాన్ని చాటుకున్నారు. హుజురాబాద్ నియోజకవర్గం సింగాపూరం సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురైన యువతి..లారీ కింద ఇరుక్కుపోయింది. మానకొండూర్ మండలం ఖెల్లడ గ్రామానికి చెందిన యువతి దివ్య శ్రీ సింగాపూరం సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురైంది. ములుగు పర్యటనకు వెళ్తు ప్రమాదాన్ని చూసి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తన వాహనాన్ని ఆపారు. అటువైపు వెళుతున్న లారీలను ఆపి జాకీలు, కత్తెర తెప్పించారు. జుట్టు కత్తిరించి యువతి ప్రాణాలను కాపాడారు స్థానికులు. గాయాలపాలైన యువతిని కరీంనగర్లోని లైఫ్ లైన్ ప్రైవేట్ ఆసుపత్రికి పంపి.. చికిత్సకు అయ్యే ఖర్చును తానే చెల్లిస్తానని ఆసుపత్రి వైద్యులకు బండి సంజయ్ చెప్పారు.
Bandi Sanjay saved life of a young woman
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)