సిద్దిపేట - చిన్నకోడూరు మండలం కస్తూరిపల్లి గ్రామానికి చెందిన సత్యం, అతని సోదరుడు శ్రీనివాస్ తల్లి లచ్చవ్వతో కలిసి సిద్దిపేటలోని వివేకానందనగర్ కాలనీలో స్థిరపడ్డారు. సత్యంకు భార్య, కుమారుడు అన్విష్ నందన్, కుమార్తె త్రివర్ణహాసిని ఉన్నారు. కాగా సత్యం తన సోదరుడు శ్రీనివాస్‌కు రూ. లక్షన్నర అప్పు తెచ్చి పెళ్లి చేశారు. అనంతరం అవసరం నిమిత్తం మరో రూ.4 లక్షలు ఇచ్చారు.

వీడియో ఇదిగో, ఉరి వేసుకుని ఐదో తరగతి విద్యార్థి ఆత్మహత్య, నా బిడ్డది ఉరి వేసుకునే వయసా అంటూ రోదించిన తల్లి

ఈక్రమంలో వీరిమధ్య గొడవలు కావడంతో శ్రీనివాస్ తన భార్య, తల్లితో కలిసి వేరుగా ఉంటున్నాడు. సత్యం ఏడాది కిందట అనారోగ్యానికి గురయ్యారు. తన శస్త్రచికిత్సకు రూ.9.80 లక్షలు ఖర్చయ్యాయని, ఆర్థిక పరిస్థితి బాగాలేదని నెలరోజుల కిందట శ్రీనివాస్ ఇంటికి వెళ్లి గతంలో తాను ఇచ్చిన సొమ్ము మొత్తం రూ.5.50 లక్షలు ఇవ్వాలని అడిగారు. శ్రీనివాస్ తాను ఇవ్వనంటూ తెగేసి చెప్పి అన్నపై దుర్భాషలాడి దాడికి పాల్పడ్డాడు. దీంతో అప్పటి నుంచి తీవ్ర మనస్తాపానికి గురైన సత్యం ఇద్దరు పిల్లలను తీసుకుని పట్టణ శివారులోని చింతల్ చెరువు వద్దకు ద్విచక్రవాహంపై వెళ్లారు. తమ ముగ్గురి చావుకు సోదరుడు శ్రీనివాసే కారణమంటూ సెల్ఫీ వీడియో, సూసైడ్ నోటు వాహనంలో పెట్టి తన పిల్లలతో కలిసి చెరువులో దూకి ఆత్మహత్యకు చేసుకున్నాడు.

Father committed suicide along with the children

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)