Video: వీడియో ఇదిగో..పెట్రోల్ బంక్‌లో కార్మికుడిపై దాడి చేసి చంపేసిన ముగ్గురు యువకులు, కార్డు స్వైపింగ్ లేదు నగదు ఇవ్వమన్నందుకే దారుణం

నార్సింగిలో నిన్న రాత్రి ముగ్గురు యువకులు పెట్రోల్ బంక్( Petrol Bunk ) సిబ్బందిపై దాడి చేసి తీవ్రంగా గాయ‌ప‌రిచారు.యువ‌కుల దాడిలో పెట్రోల్ బంక్‌కు చెందిన కార్మికుడు మృతి చెందాడు.

Representational Purpose Only (File Image)

నార్సింగిలో నిన్న రాత్రి ముగ్గురు యువకులు పెట్రోల్ బంక్( Petrol Bunk ) సిబ్బందిపై దాడి చేసి తీవ్రంగా గాయ‌ప‌రిచారు.యువ‌కుల దాడిలో పెట్రోల్ బంక్‌కు చెందిన కార్మికుడు మృతి చెందాడు.కారులో పెట్రోల్ పోయించుకుని, పేమెంట్ కోసం యువ‌కులు కార్డు ఇచ్చారు. స్వైపింగ్ యంత్రం లేదు.. డ‌బ్బు ఇవ్వాల‌ని సిబ్బంది అడ‌గ‌డంతో.. యువ‌కులు రెచ్చిపోయారు. బంక్‌లో ఉన్న ఇద్ద‌రు కార్మికుల‌పై ముగ్గురు యువ‌కులు దాడి చేశారు.

త‌ల‌పై బ‌లంగా కొట్ట‌డంతో సంజ‌య్ అనే కార్మికుడు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందాడు.మ‌రొక‌రికి తీవ్ర గాయాల‌య్యాయి. పెట్రోల్ బంక్ యాజ‌మాన్యం ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న నార్సింగి పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించారు. ఆ ముగ్గురిని జ‌న్వాడ‌కు చెందిన న‌రేంద‌ర్, మ‌ల్లేశ్‌, అనూప్‌గా పోలీసులు గుర్తించారు.దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)