Vivekananda Beats Harish Rao: తెలంగాణలో అత్యధిక మెజార్టీ హరీశ్ రావుది కాదు.. వివేకానందదే! ఏంటా సంగతి??

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ 64, బీఆర్ఎస్ 39, బీజేపీ 8, ఇతరులు ఎనిమిది చోట్ల గెలుపొందారు. ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీ సిద్దిపేట నుంచి హరీశ్ రావుది లేదా సిరిసిల్లలో కేటీఆర్‌ది అవుతుందని చాలామంది భావించారు.

Harish rao (Photo-TRS Twitter)

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Assembly Elections) కాంగ్రెస్ (Congress) పార్టీ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ 64, బీఆర్ఎస్ (BRS) 39, బీజేపీ 8, ఇతరులు ఎనిమిది చోట్ల గెలుపొందారు. ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీ సిద్దిపేట నుంచి హరీశ్ రావుది లేదా సిరిసిల్లలో కేటీఆర్‌ది అవుతుందని చాలామంది భావించారు. కానీ కుత్బుల్లాపూర్ నుంచి పోటీ చేసిన బీఆర్ఎస్ అభ్యర్థి వివేకానంద అత్యధిక మెజార్టీ ఓట్లతో గెలిచారు. వివేకానంద తన సమీప బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్‌ పై 85,576 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

TS New CM Revanth Reddy: తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి!.. నేడు ప్రమాణ స్వీకారం.. కార్యక్రమానికి రాహుల్, ప్రియాంక, ఖర్గే

ఆ తర్వాత వీళ్లు..

  • సిద్దిపేట నుంచి హరీశ్ రావు 82,308 ఓట్లు
  • కూకట్ పల్లి నుంచి మాధవరం కృష్ణారావు 70,387 ఓట్లు
  • నకిరేకల్ నుంచి వేముల వీరేశం 68,838 ఓట్లు
  • మంచిర్యాల నుంచి ప్రేమ్ సాగర్ రావు 66,116 ఓట్లు
  • నాగార్జున సాగర్ నుంచి కుందూరు జైవీర్ రెడ్డి 55,849 ఓట్లు
  • నల్గొండ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 54,332 ఓట్లు

Here's IANS Tweet

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now