Weather Forecast in TS: వీడియో ఇదిగో, వికారాబాద్ జిల్లాను ముంచెత్తిన భారీ వర్షం, రానున్న ఐదు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం
మర్పల్లి మండల కేంద్రంలో వడగండ్ల వాన( Hailstorm ) పడింది. వికారాబాద్, పరిగి, పూడూరు మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది.
వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షం( rain ) కురిసింది. మర్పల్లి మండల కేంద్రంలో వడగండ్ల వాన( Hailstorm ) పడింది. వికారాబాద్, పరిగి, పూడూరు మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. గత వారం పది రోజుల నుంచి ఎండలు మండిపోతున్న క్రమంలో ఇవాళ వర్షాలు కురియడంతో ప్రజలు ఉక్కపోత నుంచి ఉపశమనం పొందారు.రానున్న ఐదు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన ఓ మెస్తరు వానలు కురిసే అవకాశమున్నట్లు తెలిపింది.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)