Weather Update: తెలంగాణకు రానున్న రెండు రోజుల పాటు భారీ వర్ష సూచన, హైదరాబాద్‌ సహా పలు జిల్లాల్లో ఉరుములు,మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం

గత వారం నుంచి తెలంగాణవ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. రాత్రి పలు చోట్ల కురిసిన వర్షంతో జాగా ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఈ క్రమంలో తెలంగాణలో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Rains (Photo-Twitter)

గత వారం నుంచి తెలంగాణవ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. రాత్రి పలు చోట్ల కురిసిన వర్షంతో జాగా ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఈ క్రమంలో తెలంగాణలో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వాతావరణశాఖ తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్‌ సహా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక, శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. కాగా, శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, జనగాం, యాదాద్రి, వరంగల్‌, హన్మకొండ, సిద్దిపేట, నిజామాబాద్‌, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు పేర్కొంది.

Here's News Update

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now