Apple Watch Saves Life: 150 అడుగుల లోయలో పడిపోయిన యువకుడి ప్రాణాలు కాపాడిన ఆపిల్ వాచ్, త్వరగా కోలుకోవాలని టిమ్ కుక్ ట్వీట్
యాపిల్‌వాచ్ ఓ యువకుడి ప్రాణం కాపాడింది.150 అడుగుల లోయలో పడిపోయిన బాలుడి సమాచారాన్ని కుటుంబ సభ్యులకు చేరవేసింది. మహారాష్ట్రలోని రాయ్‌గడ్‌కు చెందిన స్మిత్ మేథా (17) తన స్నేహితులతో కలిసి ముంబై సమీపంలోని లోనావాలకు సందర్శనకు వెళ్లాడు.
యాపిల్‌వాచ్ ఓ యువకుడి ప్రాణం కాపాడింది.150 అడుగుల లోయలో పడిపోయిన బాలుడి సమాచారాన్ని కుటుంబ సభ్యులకు చేరవేసింది. మహారాష్ట్రలోని రాయ్‌గడ్‌కు చెందిన స్మిత్ మేథా (17) తన స్నేహితులతో కలిసి ముంబై సమీపంలోని లోనావాలకు సందర్శనకు వెళ్లాడు. విసాపూర్ కోటపైకి ట్రెక్కింగ్ చేస్తుండగా కాలుజారి లోయలో పడిపోయాడు. కదిలే పరిస్థితి లేదు. ఆ సమయంలో అతడి వద్ద మొబైల్ కూడా లేదు. వెంటనే ఆ బాలుడికి చేతికున్న యాపిల్ 7 సిరీస్ వాచ్ గుర్తొచ్చింది. దానినుంచి కుటుంబ సభ్యులకు ఫోన్‌చేశాడు. వారు లొకేషన్ ఆధారంగా అక్కడికి చేరుకొని అతడిని రక్షించారు. యాపిల్ వాచ్ వల్లే బతికానని మేథా పేర్కొన్నాడు. ఈ విషయంపై కృతజ్ఞతలు తెలుపుతూ యాపిల్ సీఈవో టిమ్ కుక్‌కు మేథా మెయిల్ చేశాడు. త్వరగా కోలుకోవాలని కుక్ బదులిచ్చాడు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)