New Delhi, SEP 14: ఆపిల్ ఇటీవల మార్కెట్లో ఆవిష్కరించిన ఐ-ఫోన్ 16 సిరీస్ ఫోన్లపై (I Phone 16) భారత్ కస్టమర్లు ప్రీ ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు. టోకెన్ సొమ్ము చెల్లించి భారతీయ యూజర్లు ఐ-ఫోన్ 16 సిరీస్ ఫోన్లు బుక్ (iPhone 16 Series Booking) చేసుకోవచ్చు. ఐ-ఫోన్ 16, ఐ-ఫోన్ 16 ప్లస్, ఐ-ఫోన్ 16 ప్రో, ఐ-ఫోన్ 16 ప్రో మ్యాక్స్ ఫోన్ల విక్రయాలు ఈ నెల 20 నుంచి ప్రారంభం అవుతాయి. కొత్త ఐ-ఫోన్ మోడల్ స్మార్ట్ ఫోన్లపై ఆథరైజ్డ్ థర్డ్ పార్టీ రిటైలర్లు డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ ఆఫర్లు ప్రకటించాయి. ఐ-ఫోన్ 16 ఫోన్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.79,900 పలుకుతుంది. ఐ-ఫోన్ 16 ప్లస్ ఫోన్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ 89,900 నుంచి మొదలవుతుంది. ఈ ఫోన్లు బ్లాక్, పింక్, టీల్, ఆల్ట్రా మెరైన్, వైట్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. మరోవైపు ఐ-ఫోన్ 16 ప్రో (iPhone 16 Pro) ఫోన్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.1,19,900, ఐ-ఫోన్ 16 ప్రో మ్యాక్స్ ఫోన్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.1,44,900 పలుకుతున్నాయి. ఈ ఫోన్లు బ్లాక్ టైటానియం, డసర్ట్ టైటానియం, నాచురల్ టైటానియం, వైట్ టైటానియం కలర్ ఆప్షన్లలో లభిస్తాయి.
ఆపిల్ ఐ-ఫోన్ యూజర్లు ఆపిల్ వెబ్ సైట్ ద్వారా గానీ, ముంబైలోని ఆపిల్ బీకేసీ, ఢిల్లీలోని ఆపిల్ సాకేత్ స్టోర్లలో గాని ప్రీ ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు. కస్టమర్ల డిమాండ్, గిరాకీని బట్టి డెలివరీకి ఈ నెల 20 నుంచి నాలుగు నుంచి ఏడు, అంతకంటే ఎక్కువ రోజులు సమయం పడుతుంది. అమెరికన్ ఎక్స్ ప్రెస్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకు కార్డులపై ఆపిల్ ఐ-ఫోన్ 16 ఫోన్ కొనుగోలు చేసే వారికి రూ.5000 క్యాష్ బ్యాక్ లేదా డిస్కౌంట్ లభిస్తుంది. మూడు నెలల నుంచి ఆరు నెలల వరకూ నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లతోపాటు రూ.67,500 ఎక్స్చేంజ్ ఆఫర్లు ఉంటాయి.
Realme P2 Pro 5G: అదిరిపోయే ఫీచర్లతో రియల్ మీ పీ2 ప్రో 5జీ విడుదల, ధర ఎంతంటే..
ఆప్ట్రోనిక్స్, ఐవీనస్, ఇమాజిన్, ఐఫ్యూచర్, యూనికార్న్ వంటి థర్డ్ పార్టీ రిటైల్ సంస్థలు ఐఫోన్ 16 ఫోన్ల కొనుగోళ్లపై క్యాష్ బ్యాక్ అండ్ ఎక్స్చేంజ్ బోనస్ అందిస్తున్నాయి. ఎస్బీఐ, కొటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకు కార్డుల ద్వారా రూ.4000-5000 క్యాష్ బ్యాక్, ప్రీ ఆర్డర్ బుక్ చేసుకుంటే రూ.500 క్యాష్ బ్యాక్ తోపాటు ఎక్స్చేంజ్ బోనస్ రూ.8000 వరకూ అందిస్తున్నాయి.