Relame P2 Pro 5G Colours Image (Photo Credit: Official Website)

చైనా దిగ్గజం రియల్‌మీ (Realme) తన రియల్ మీ పీ2 ప్రో 5జీ (Realme P2 Pro 5) ఫోన్ ను శుక్రవారం భారత్ మార్కెట్లో విడుదల చేసింది. దీంతోపాటు రియల్‌మీ పాడ్ 2 లైట్ (Realme Pad 2 Lite) కూడా తీసుకొచ్చింది. రియల్ మీ పీ2 ప్రో 5జీ (Realme P2 Pro 5) ఫోన్ 4 ఎన్ఎం ఒక్టాకోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్ 2 ఎస్వోసీ, 80వాట్ల వైర్డ్ సూపర్ వూక్ చార్జింగ్ మద్దతుతో 5200 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంటుంది. 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ+ 3డీ కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్, 50-మెగా పిక్సెల్ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 32-మెగా పిక్సెల్ కెమెరా ఉంటాయి. మూడు ర్యామ్, మూడు స్టోరేజీ వేరియంట్లలో ఈ ఫోన్ లభిస్తుంది.

రియల్ మీ నార్జో 70 టర్బో 5జీ మార్కెట్లోకి వచ్చేసింది, ధర, ఫీచర్లు ఇతర వివరాలు ఇవిగో..

రియల్ మీ పీ2 ప్రో 5జీ (Realme P2 Pro 5) ఫోన్ 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.21,999, 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.24,999, 12 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.27,999 లకు లభిస్తుంది. ఈగల్ గ్రే, ప్యారెట్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఈ నెల 17 సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకూ ఎర్లీ బర్డ్ సేల్స్ జరుగుతాయి. రియల్‌మీ ఇండియా వెబ్ సైట్, ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్స్ ప్రారంభం అవుతాయి. ఎర్లీ బర్డ్ సేల్స్ కింద రూ.2,000, బ్యాంకు డిస్కౌంట్ కింద రూ.1,000 రాయితీ ఉంటుంది. మూడు నెలల వరకూ నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ లభిస్తుంది.

రియల్ మీ పీ2 ప్రో 5జీ ఫీచర్లు

120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటు,

240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్,

2000 నిట్స్ పీక్ బ్రైట్ నెస్

6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ+ (1080×2412 పిక్సెల్స్) 3డీ కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్

కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7ఐ ప్రొటెక్షన్

ఆండ్రాయిడ్ 14 బేస్డ్ రియల్ మీ యూఐ 5 ఓఎస్ వర్షన్

50-మెగా పిక్సెల్ సోనీ ఎల్వైటీ 600 ప్రైమరీ సెన్సర్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్),

8-మెగా పిక్సెల్ ఆల్ట్రావైడ్ కెమెరా,

32-మెగా పిక్సెల్ సెన్సర్ సెల్ఫీ కెమెరా

5200 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ

ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్,

షాక్ అబ్జార్బింగ్ ఆర్మూర్ షెల్ ప్రొటెక్షన్

5జీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.2, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ