Fraud Alert: ఆ రివార్డ్స్ పాయింట్స్ లింక్స్ అన్నీ ఫేక్, వాట్సప్, ఎసెమ్మెస్‌లో వచ్చే ఈ లింకులను క్లిక్ చేయొద్దని హెచ్చరించిన ఎస్‌బీఐ
ఈ నేపథ్యంలో ఎస్‌బీఐ తమ కస్టమర్లను అప్రమత్తం చేసింది. తమ బ్యాంకు రివార్డ్ పాయింట్ల పేరుతో జరుగుతున్న సైబర్ నేరాలపై ఎస్‌బీఐ (SBI) స్పందిస్తూ.. రివార్డు పాయింట్ల విషయంలో తాము ఎలాంటి లింకులు పంపబోమని స్పష్టం చేసింది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) రివార్డ్స్ పేరిట ఈ మధ్య వాట్సప్ సందేశాలు చక్కర్లు కొడుతున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ఎస్‌బీఐ తమ కస్టమర్లను అప్రమత్తం చేసింది. తమ బ్యాంకు రివార్డ్ పాయింట్ల పేరుతో జరుగుతున్న సైబర్ నేరాలపై ఎస్‌బీఐ (SBI) స్పందిస్తూ.. రివార్డు పాయింట్ల విషయంలో తాము ఎలాంటి లింకులు పంపబోమని స్పష్టం చేసింది. ఏపీకే ఫైల్స్ డౌన్‌లోడ్ చేసుకోవాలని కోరబోమని తెలిపింది. ఇలా వాట్సప్, ఎసెమ్మెస్‌లో వచ్చే ఎలాంటి లింకులను క్లిక్ చేయొద్దని హెచ్చరించింది. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇంజనీరింగ్ పూర్తిచేసిన వారికి ఎస్ బీఐ బంపర్ ఆఫర్, ఏకంగా 85వేల పోస్టులు భర్తీ, అందులో ఎక్కువగా ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకే అవకాశం
కాగా ఎస్‌బీఐ పేరిట వాట్సప్‌లో రివార్డ్స్ (SBI Rewardz) లింకు విస్తృతంగా ప్రచారమవుతోంది. తెలిసిన నంబర్ల నుంచే వస్తుండటంతో దాన్ని చూసినవారు నిజమని నమ్ముతున్నారు. ఫలితంగా సులభంగా మోసపోతున్నారు. ‘మీ ఎస్‌బీఐ రివార్డ్ రూ.7,250 యాక్టివేట్ అయింది. దీని గడువు ఈరోజుతో ముగిసిపోతుంది. డబ్బులు పొందేందుకు ఎస్‌బీఐ రివార్డ్స్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి. తద్వారా మీ ఖాతాలో డబ్బులు జమ చేసుకోండి’ అంటూ సందేశంలో పేర్కొంటున్నారు. ఎస్‌బీఐ యోనో పేరిట ఓ లింకును సైతం జత చేస్తున్నారు.
Here's SBI Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)