SBI

Mumbai, May 12: ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు భారతీయ స్టేట్ బ్యాంక్ (SBI) తీపి కబురందించింది. ఐటీ రంగంలో నియామకాలు నెమ్మదించిన టైంలో ఫ్రెషర్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఎస్బీఐ (SBI Jobs) ప్రత్యామ్నాయం చూపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో 12 వేల మంది ఫ్రెషర్లను నియమించుకుంటామని తెలిపింది. ఇందులో 85 శాతం మంది ఇంజినీరింగ్ (Engineering) గ్రాడ్యుయేట్లకు అవకాశం కల్పిస్తామని ఎస్బీఐ చైర్మన్ దినేశ్ ఖర్రా చెప్పారు. 3000 మంది ప్రాజెక్టు ఆఫీసర్లు, 8,000 మంది అసోసియేట్లకు బ్యాంకింగ్ వ్యవహారాల్లో ట్రైనింగ్ ఇచ్చి.. అటుపై వివిధ వ్యాపార విభాగాల్లో నియమిస్తామన్నారు.

DOT Order To Black 28,200 Mobile Handsets: 28,200 మొబైల్ హ్యాండ్‌సెట్‌లను వెంటనే బ్లాక్ చేయాలని డాట్ ఆదేశాలు, 20 లక్షల మొబైల్ కనెక్షన్లను రీ-వెరిఫై చేయాలని ఆర్డర్  

గతంతో పోలిస్తే బ్యాంకింగ్ రంగం టెక్నాలజీపై ఆధార పడటం పెరిగిందని దినేష్ ఖర్రా తెలిపారు. టెక్నాలజీ ఆధారంగా ఖాతాదారులకు కొత్తగా ఏ విధంగా సేవలందించాలన్న విషయమై ద్రుష్టి సారించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఈ విషయమై కొన్ని బ్యాంకులు సవాళ్లు ఎదుర్కొంటున్న సంగతి గుర్తు చేశారు. శిక్షణ పొందిన వారి అర్హతలు, ప్రతిభ ఆధారంగా వివిధ వ్యాపార, ఐటీ రంగ బాధ్యతలు అప్పగిస్తామని తెలిపారు. అప్పుడే బ్యాంకింగ్ రంగానికి తగిన రీతిలో టెక్ మ్యాన్ పవర్ అందించగలం అని అన్నారు.

WhatsApp Chat Lock Feature: వాట్సాప్‌లోకి కొత్తగా చాట్ లాక్ ఫీచర్‌, యాక్టివేట్ చేసుకోవడం ఎలాగో తెలుసుకోండి 

ఎస్బీఐ సిబ్బంది ఇన్‌హౌస్ ఇన్‌స్టిట్యూట్‌లో టెక్నాలజీపై శిక్షణ ఇవ్వడానికి భారీ మొత్తంలోనే ఖర్చవుతున్నదని దినేశ్ ఖర్రా చెప్పారు. ప్రతి ఉద్యోగీ టెక్నాలజీని అంది పుచ్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పుడు అత్యధికంగా టెక్నాలజీ ఆధారంగా బ్యాంకింగ్ లావాదేవీలు జరుగుతున్న సంగతిని ఎవరూ విస్మరించలేరన్నారు. ఈ విషయమై బ్యాంకింగ్ నియంత్రణ సంస్థ ‘ఆర్బీఐ’ కూడా తగిన మార్గదర్శకాలు జారీ చేసిందని చెప్పారు.