SBI YONO Alert: ఎస్‌బీఐ యోనో యాప్‌పై కీలక ప్రకటన, ఆండ్రాయిడ్ 12 కంటే తక్కువ ఉన్న వారికి మార్చి 1 నుంచి సేవలు బంద్, కొత్త వెర్షన్ మొబైల్‌కి మారాలని సూచన

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యోనో యాప్ ద్వారా ఖాతాదారులకు మరింత చేరువ అయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా యోనో యాప్ వినియోగంపై ఎస్‌బీఐ కీలక ప్రకటన చేసింది. సైబర్ నేరాలు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో భద్రత దృష్ట్యా ఎస్‌బీఐ ఈ కీలక సూచనలు చేసింది.

SBI YONO app is not compatible with Android 11 or lower versions (Photo-X/Google Playstore)

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యోనో యాప్ ద్వారా ఖాతాదారులకు మరింత చేరువ అయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా యోనో యాప్ వినియోగంపై ఎస్‌బీఐ కీలక ప్రకటన చేసింది. సైబర్ నేరాలు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో భద్రత దృష్ట్యా ఎస్‌బీఐ ఈ కీలక సూచనలు చేసింది. ఆండ్రాయిడ్ 11, అంతకంటే తక్కువ వెర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న స్మార్ట్ ఫోన్లలో త్వరలోనే యోనో సేవలు నిలిపి వేయనున్నట్లు తెలిపింది.

టెలికాం కంపెనీలకు ట్రాయ్‌ కొత్త నిబంధనలు, 2జీ వినియోగదారుల కోసం ఆ రీచార్జ్‌లు ఉండాల్సిందేనని ఆదేశం

వెంటనే ఎస్‌బీఐ ఖాతాదారులు కొత్త వెర్షన్ మొబైల్‌కి మారాలని సూచించింది. ఈ విషయాన్ని ఖాతాదారులకు సందేశాల ద్వారా తెలియజేస్తోంది. ఆండ్రాయిడ్ 12 అంతకంటే ఎక్కువ వెర్షన్ మొబైల్‌కి అప్‌గ్రేడ్ కావడానికి ఫిబ్రవరి 28 వరకు గడువు ఇచ్చింది. అప్పటి వరకూ మాత్రమే యోనో సేవలు ఆండ్రాయిడ్ 12 కంటే తక్కువ వెర్షన్ మొబైల్ వాడే వారు కూడా పొందే అవకాశం ఉంటుంది. పాత వెర్షన్ మొబైల్స్‌లో మార్చి 1 నుంచి యోనో సేవలు నిలిచిపోతాయని ఖాతాదారులకు ఎస్‌బీఐ స్పష్టం చేసింది.

YONO app is not compatible with Android 11 or lower versions 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now