Electricity From Urine: మనిషి మూత్రంతో కరెంట్ ఉత్పత్తి.. ఎరువులు కూడా.. ఐఐటీ పాలక్కాడ్ కి చెందిన పరిశోధకుల ఆవిష్కరణ
మనిషి మూత్రంతో కరెంట్ తో పాటు పాటు ఎరువులను కూడా ఉత్పత్తి చేసే విధానాన్ని కనిపెట్టారు.
Newdelhi, Feb 16: ఐఐటీ (IIT) పాలక్కాడ్ కి చెందిన పరిశోధకులు అద్భుత ఆవిష్కరణ చేశారు. మనిషి మూత్రంతో (Human Urine) కరెంట్ తో (Electricity) పాటు పాటు ఎరువులను కూడా ఉత్పత్తి చేసే విధానాన్ని కనిపెట్టారు. మానవ మూత్రాన్ని ఎలక్ట్రోకెమికల్ రిసోర్స్ రికవరీ రియాక్టర్ లోకి ప్రవేశపెట్టి, ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్స్ కు గురిచేయడం వల్ల విద్యుత్తుతోపాటు బయోఫెర్టిలైజర్స్ ను ఉత్పత్తి చేయొచ్చని వారు తెలిపారు. పేటెంట్ కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు.