‘Shiva-Shakti’: విశ్వంలో శివ-శక్తి.. పాలపుంత ఏర్పడటానికి కారణం ఈ రెండు నక్షత్ర మండలాలే.. మాక్స్‌ప్లాంక్‌ ఇన్‌స్టిట్యూట్‌ పరిశోధకుల వెల్లడి

ఇప్పుడు సైన్స్ పరంగానూ అది నిజమని చూచాయగా తెలుస్తున్నది.

Milkey Way (Credits: X)

Newdelhi, Mar 23: శివుడు-శక్తి (Shiva-Shakti) కలయికే విశ్వ ఆవిర్భావానికి మూలమని పురాణేతిహాసాలు ఘోషిస్తున్నాయి. ఇప్పుడు సైన్స్ పరంగానూ అది నిజమని చూచాయగా తెలుస్తున్నది. భూగ్రహం ఉన్న పాలపుంత (Milkey way) కూడా రెండు నక్షత్ర సముదాయాల (చిన్న గెలాక్సీలు) కలయికతో ఏర్పడినట్టు గుర్తించామని మాక్స్‌ ప్లాంక్‌ ఇన్‌స్టిట్యూట్‌ పరిశోధకులు తాజాగా తెలిపారు. సుమారు 1200-1300 కోట్ల ఏండ్ల కిందట ఇది జరిగినట్టు పేర్కొన్నారు. దాని పర్యావసానమే ప్రస్తుతం మనం చూస్తున్న పాలపుంత గెలాక్సీ అని తెలిపారు. ఆ రెండు నక్షత్ర సముదాయాలకు ‘శివ-శక్తి’ అని నామకరణం చేశారు.

Terror Attack in Russia: రష్యాలో ఉగ్రవాదుల ఘాతుకం.. మ్యూజిక్ కన్సర్ట్ హాలుపై దాడి.. గ్రెనేడ్లు విసరడంతో పాటు కాల్పులకు తెగబడ్డ ముష్కరులు.. 60 మంది మృతి.. దాడికి బాధ్యత వహిస్తూ ప్రకటన విడుదల చేసిన ఐసిస్