Khairatabad Ganesh (photo-Video Grab)

Khairatabad Ganesh: తెలుగు రాష్ట్రాల్లోనే (Telugu States) కాకుండా దేశవ్యాప్తంగా ఎంతో పేరుపోయిన ఖైరతాబాద్ మహా గణపతి భక్తులకు (Khairatabad Big Ganesh Darshan) దర్శనమిస్తున్నారు.ఈ ఏడాది 70 అడుగుల ఎత్తులో సప్తముఖశక్తి మహాగణపతిగా దర్శనమిస్తున్న గణేష్‌ ను (Khairatabad Ganesh) దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరుతున్నారు. ఖైరతాబాద్‌ గణేశుడికి 70 ఏళ్ల చరిత్ర ఉంది.. 1954లో ఒక్క అడుగు వినాయకుడిని ఉత్సవాలు ప్రారంభించారు. ఆ తర్వాత ఏడాదికో అడుగు పెంచుకుంటూ 60 అడుగులకు పైగా విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఈ ఏడాది 70వ సంవత్సరం కావడంతో ఏకండా 70 అడుగు భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు.

వీడియో ఇదిగో, 20 వేల కేజీల బెల్లంతో వినాయకుడు, గాజువాకలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న గణపతి విగ్రహం

పూర్తిగా మట్టితో తయారుచేసిన ప్రతిమను మాత్రమే ప్రతిష్టిస్తామని ఉత్సవకమిటీ సభ్యులు పేర్కొన్నారు. గతేడాదిలాగే ఖైరతాబాద్​ మహా గణపతిని ఈ నెల 17వ తేదీన మధ్యాహ్నం ఒంటి గంట లోపు నిమజ్జనం చేయాలని సిటీ సీపీ సీవీ ఆనంద్​ఉత్సవ కమిటీ సభ్యులకు సూచించారు. చివరి పూజ అనంతరం 17న ఉదయం 6.30 గంటల కల్లా శోభాయాత్రను ప్రారంభించాలని చెప్పారు. భక్తుల రద్దీకి అనుగుణంగా బందోబస్తు పెంచుతున్నామని చెప్పారు.