Chandrayaan-2 Mission: వెల్కమ్ బడ్డీ అంటూ విక్రమ్‌కి స్వాగతం చెప్పిన ఆర్బిటార్ ప్రదాన్, ఆగస్టు 23వ తేదీన సాయంత్రం 5.20 నిమిషాల నుంచి విక్రమ్ ల్యాండింగ్‌పై లైవ్ టెలికాస్ట్
ఆగస్టు 23వ తేదీ సాయంత్రం చందమామపై ఆ ల్యాండర్ దిగే అవకాశం ఉంది. అయితే చంద్రయాన్-2కు చెందిన ఆర్బిటార్ ప్రదాన్ ప్రస్తుతం కక్ష్యలోనే తిరుగుతున్న విషయం తెలిసిందే.ఆ ఆర్బిటార్ .. విక్రమ్‌కు వెల్కమ్ చెప్పింది.
చంద్రయాన్-3(Chandrayaan-3) మిషన్‌లో భాగంగా వెళ్లిన విక్రమ్ ల్యాండర్ దాదాపు చంద్రుడి ఉపరితలానికి చేరుకున్నది. ఆగస్టు 23వ తేదీ సాయంత్రం చందమామపై ఆ ల్యాండర్ దిగే అవకాశం ఉంది. అయితే చంద్రయాన్-2కు చెందిన ఆర్బిటార్ ప్రదాన్ ప్రస్తుతం కక్ష్యలోనే తిరుగుతున్న విషయం తెలిసిందే.ఆ ఆర్బిటార్ .. విక్రమ్‌కు వెల్కమ్ చెప్పింది.
ఇస్రో తన ఎక్స్ సోషల్ మీడియా అకౌంట్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది. వెల్కమ్ బడ్డీ అంటూ ఆ మెసేజ్‌లో పోస్టు చేశారు. చంద్రయాన్-2 ఆర్బిటార్, చంద్రయాన్-3 ల్యాండర్‌తో టూ వే కమ్యూనికేషన్ ఏర్పాటు చేసినట్లు ఇస్రో తెలిపింది. ఆగస్టు 23వ తేదీన సాయంత్రం 5.20 నిమిషాల నుంచి విక్రమ్ ల్యాండింగ్‌పై లైవ్ టెలికాస్ట్ ఉంటుందని ఇస్రో వెల్లడించింది.
Here's Update