Twitter Verification New Update 2023: ఇవాల్టి నుంచి వాళ్లకు ట్విట్టర్ వెరిఫైడ్ మార్క్ తొలగింపు, ఆదాయం పెంచుకునేందుకు ఎలాన్ మస్క్ ఎత్తుగడ
ఇప్పటికే ట్విట్టర్ బ్లూ టిక్ కోసం సబ్ స్క్రిప్షన్ పెట్టారు. తాజాగా మరో అప్‌డేట్ ఇచ్చారు మస్క్. లెగసీ అకౌంట్లకు (Legacy Accounts) వెరిఫైయిడ్ చెక్ మార్క్స్ తీసేయనున్నారు. వాటికోసం కూడా డబ్బులు కట్టాలని, ఇవాల్టి నుంచి వాటిని తీసేస్తున్నట్లు ట్విట్టర్ తెలిపింది.
Washington, April 20: ట్విట్టర్ ఆదాయాన్ని పెంచుకునేందుకు కావాల్సిన అన్ని మార్గాలను వెతుకుతున్నారు ఎలాన్ మస్క్ (Elon Musk). ఇప్పటికే ట్విట్టర్ బ్లూ టిక్ కోసం సబ్ స్క్రిప్షన్ పెట్టారు. తాజాగా మరో అప్‌డేట్ ఇచ్చారు మస్క్. లెగసీ అకౌంట్లకు (Legacy Accounts) వెరిఫైయిడ్ చెక్ మార్క్స్ (Verified Checkmarks) తీసేయనున్నారు. వాటికోసం కూడా డబ్బులు కట్టాలని, ఇవాల్టి నుంచి వాటిని తీసేస్తున్నట్లు ట్విట్టర్ తెలిపింది. ఒకవేళ వెరిఫైడ్ టిక్ మార్క్ (Verified Checkmarks) కావాలంటే ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలంటూ ఎలాన్ మస్క్ సలహా ఇచ్చారు. ఏప్రిల్ 20 నుంచి వ్యక్తిగత అకౌంట్లకు వెరిఫైయిడ్ టిక్ మార్క్ తీసేయనున్నారు.