Aircraft Crashes into Car: కారుపై కూలిన విమానం.. ఇద్దరు మృతి.. ప్రమాదం సమయంలో కారు డ్రైవర్ సిగరెట్ కోసమని పక్కకు వెళ్లడంతో బతిపోయిన వైనం.. బెల్జియంలో ఘటన
తీవ్ర గాలుల్లో లాండింగ్ చేయబోయి విఫలమైన ఓ తేలికపాటి విమానం రన్ వే సమీపంలోని కారుపై కూలిన ఘటన తూర్పు బెల్జియంలోని ఓ ఎయిరోడ్రోమ్ లో ఆదివారం సంభవించింది.
Newdelhi, Jan 29: తీవ్ర గాలుల్లో లాండింగ్ (Landing) చేయబోయి విఫలమైన ఓ తేలికపాటి విమానం (Small Aircraft) రన్ వే సమీపంలోని కారుపై (Car) కూలిన ఘటన తూర్పు బెల్జియంలోని ఓ ఎయిరోడ్రోమ్ లో ఆదివారం సంభవించింది. ఈ ప్రమాదంలో విమానంలోని ఇద్దరూ మృతిచెందారు. మృత పైలట్ ను అధికారులు జర్మనీ దేశస్తుడిగా గుర్తించారు. ప్రయాణికుడు ఎవరన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు. ప్రమాదం సమయంలో కారు డ్రైవర్ సిగరెట్ కోసమని పక్కకు వెళ్లడంతో ప్రాణాలతో బయటపడ్డాడని స్థానిక మీడియా తెలిపింది.
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)