Dubai Fire Accident: దుబాయ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. నలుగురు భారతీయులు సహా 16 మంది సజీవ దహనం.. మరణించిన వారిలో కేరళ, తమిళనాడు వాసులు
దుబాయ్ లో దారుణం జరిగింది. అక్కడి ఓ రెసిడెన్షియల్ బిల్డింగ్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన వారిలో నలుగురు భారతీయులు ఉన్నారు.
Dubai, April 17: దుబాయ్ (Dubai) లో దారుణం జరిగింది. అక్కడి ఓ రెసిడెన్షియల్ బిల్డింగ్ (Residential Building) లో జరిగిన అగ్ని ప్రమాదంలో (Fire Accident) 16 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన వారిలో నలుగురు భారతీయులు ఉన్నారు. దుబాయ్‌లోని అల్ రస్ ప్రాంతంలో శనివారం మధ్యాహ్నం 12.35 గంటల సమయంలో ప్రమాదం సంభవించినట్టు ‘గల్ఫ్ న్యూస్’ తెలిపింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న దుబాయ్ సివిల్ డిఫెన్స్ హెడ్‌క్వార్టర్స్ సిబ్బంది నివాసితులను అక్కడి నుంచి తరలించారు. ఈ ఘటనలో మరణించిన నలుగురు భారతీయుల్లో కేరళకు చెందిన దంపతులు, తమిళనాడుకు చెందిన ఇద్దరు ఉన్నట్టు అధికారులు తెలిపారు. వీరందరూ అదే భవనంలో పనిచేస్తున్నట్టు తెలుస్తోంది.
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Sircilla Horror: సిరిసిల్ల జిల్లాలో ఘోరం.. లిఫ్ట్ రాకముందే తెరచుకున్న లిఫ్డ్ డోర్.. గమనించకుండా మూడో అంతస్తు పైనుంచి పడి కమాండెంట్ మృతి (వీడియో)
Accident Averted at Hyderabad Airport: వీడియో ఇదిగో, శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానానికి తప్పిన పెను ప్రమాదం, 150 మంది ప్రయాణికులు సేఫ్
Fire Accidents: పచ్చని అడవుల్లో అగ్ని ప్రమాదం.. తెలుగు రాష్ట్రాల్లో మూడు అటవీ ప్రాంతాల్లో ప్రమాదాలు.. కిలోమీటర్ల మేర బూడిదైన చెట్లు
Advertisement
Advertisement
Advertisement