New Delhi, April 16: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (CM Arvind Kejriwal) సీబీఐ (CBI questioning) విచారణ ముగిసింది. ఉదయం నుంచి ఆయన్ను తొమ్మిదిన్నర గంటలపాటూ విచారించారు సీబీఐ అధికారులు. అసలు ఢిల్లీ లిక్కర్ స్కాం (Delhi Liquor scam) అనేదే లేదని, ఇది పూర్తిగా కుట్రపూరితంగా పెట్టిన కేసుల అని స్పష్టం చేశారు సీఎం అరవింద్ కేజ్రీవాల్. నిజాయితీగల పార్టీగా ఆప్ పై ఉన్న ముద్రను...ఇలాంటి ఆరోపణలతో బదనాం చేయలేరన్నారు. అభివృద్ధిపై బీజేపీని (BJP) ప్రజలు ప్రశ్నిస్తుంటే...వాటిని ఎదుర్కునే దమ్ములేక, ప్రతిక్షాలపై బురద జల్లే యత్నం చేస్తోందని ఆరోపించారు.
#WATCH | CBI questioning conducted for 9.5 hours. Entire alleged liquor scam is fake, AAP is 'kattar imaandaar party'. They want to finish AAP but the country's people are with us...: Delhi CM Arvind Kejriwal speaks after nine hours of CBI questioning in excise policy case pic.twitter.com/ODnCGKv7R3
— ANI (@ANI) April 16, 2023
ఆదివారం మధ్యాహ్నం 12గంటల సమయంలో కేజ్రీవాల్ సీబీఐ(CBI) ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. అయితే, అప్పటినుంచి సీబీఐ అధికారులు ఆయన్ను సుదీర్ఘంగా ప్రశ్నల వర్షం కురిపించారు. విచారణ అనంతరం సీబీఐ కార్యాలయం నుంచి కేజ్రీవాల్ బయటకు వచ్చి తన కాన్వాయ్‌లో ఇంటికి బయల్దేరి వెళ్లారు. అంతకముందు కేజ్రీవాల్‌కు సీబీఐ జారీ చేసిన సమన్లను తీవ్రంగా నిరసిస్తూ ఆ పార్టీ శ్రేణులు నిరసనకు దిగాయి. దీంతో సీబీఐ ప్రధాన కార్యాలయం వద్ద భారీగా పోలీసులను మోహరించి కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. మరోవైపు, తమ పార్టీ చీఫ్‌కు సీబీఐ సమన్లు జారీచేయడంపై ఆప్ నేతలు మండిపడుతున్నారు. సీబీఐ ప్రధాన కార్యాలయం వద్ద నిరసనకు దిగిన ఆందోళనకు దిగిన ఆప్ సీనియర్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఆప్ ఎంపీలు సంజయ్ సింగ్, రాఘవ్ చద్దా, మంత్రులు సౌరభ్ భరద్వాజ్, అతిషీ, కైలాశ్ గహ్లోత్, ఆప్ అధికార ప్రతినిధి అదిల్ అహ్మద్ ఖాన్, ఆప్ ప్రధాన కార్యదర్శి పంకజ్‌గుప్తాతో పాటు పలువురు పంజాబ్ మంత్రులు ఉన్నారు. ప్రశాంతంగా కూర్చొని నిరసన తెలుపుతున్న తమను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారని.. ఎక్కడో తెలియని ప్రాంతానికి తరలిస్తున్నారని ఆప్ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా ట్వీట్ చేశారు. కేజ్రీవాల్ విచారణ ముగిసిన అనంతరం వారిని విడుదల చేశారు.
#WATCH | AAP leaders who were detained by police for protesting outside the CBI office earlier today against CM Arvind Kejriwal's questioning by CBI released from Najafgarh police station. pic.twitter.com/7ed9XA6Teq
— ANI (@ANI) April 16, 2023
కేజ్రీవాల్ విచారణ నేపథ్యంలో ఢిల్లీ వ్యాప్తంగా దాదాపు 1500 మందిని నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు. 32 మంది ఢిల్లీ ఎమ్మెల్యేలు, 70మంది కౌన్సిలర్లతో పాటు ఢిల్లీ సరిహద్దుల్లో 20 మంది పంజాబ్ ఎమ్మెల్యేలను అరెస్టు చేశారని ఆప్ ఢిల్లీ కన్వీనర్ గోపాల్ రాయ్ అన్నారు. తమ నేతలను నిర్బంధించిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణను నిర్ణయించేందుకు ఆప్ ఆఫీస్ బేరర్లతో ఆయన అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.