Bangla Train Accident: బంగ్లాదేశ్ లో విషాదం.. ప్యాసింజర్ రైలులో మంటలు.. ఐదుగురి సజీవదహనం (వీడియోతో)
పొరుగు దేశం బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఘోరం జరిగింది. ప్యాసింజర్ రైలులో మంటలు చెలరేగి ఐదుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు.
Dhaka, Jan 6: పొరుగు దేశం బంగ్లాదేశ్ (Bangladesh) రాజధాని ఢాకాలో (Dhaka) ఘోరం జరిగింది. ప్యాసింజర్ రైలులో (Train) మంటలు చెలరేగి ఐదుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. జెస్సోర్ నుంచి ఢాకాకు చేరుకున్న బెనాపోల్ ఎక్స్ ప్రెస్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగింది. కనీసం నాలుగు కోచ్ లకు మంటలు వ్యాపించాయని ఓ అధికారి వెల్లడించారు. ఆదివారం జరుగనున్న జాతీయ ఎన్నికలను బహిష్కరించాలంటూ ప్రతిపక్షాలు నిరసనలు తెలుపుతున్న సమయంలో జరిగిన ఈ ఘటనలో కుట్రకోణంపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)