Last Date for Abhayahastam: ప్రజాపాలన ‘అభయహస్తం’ దరఖాస్తులకు నేడే ఆఖరు.. ఇప్పటికే, కోటి దాటిన దరఖాస్తులు.. ఈరోజు దరఖాస్తు ఇవ్వలేకపోతే తహసీల్దారు, మున్సిపల్ కార్యాలయాల్లో దరఖాస్తుకు అవకాశం.. దరఖాస్తుల డాటా ఎంట్రీని ఈ నెల 17 కల్లా పూర్తి చేయాలని సీఎస్ ఆదేశాలు.. ఏడాదికి మూడుమార్లు ప్రజాపాలన నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలోని అభయ హస్తం దరఖాస్తుల స్వీకరణ నేటితో ముగియనుంది. కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు సంబంధించిన అప్లికేషన్లను తీసుకుంటున్నారు.
Hyderabad, Jan 6: తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన (Prajapalana) కార్యక్రమంలోని అభయ హస్తం దరఖాస్తుల స్వీకరణ నేటితో (Last Date for Abhayahastam) ముగియనుంది. కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు సంబంధించిన అప్లికేషన్లను తీసుకుంటున్నారు. గత నెల 28న మొదలైన ఈ కార్యక్రమానికి తొలి రోజు నుంచే భారీ స్పందన వచ్చింది. డిసెంబర్ 31, జనవరి ఒకటో తేదీ మినహా ఇప్పటివరకూ ఏడు రోజల పాటు ఈ కార్యక్రమం జరిగింది. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, చేయూత పథకాలతో పాటూ రేషన్ కార్డులు, ఇతర అవసరాల కోసం ప్రజలు వినతి పత్రాలు అందిస్తున్నారు.
ప్రజాపాలన దరఖాస్తులకు ఇయ్యాల్నే ఆఖరు
Read Here :https://t.co/Hwg1ruxlsC pic.twitter.com/SDfGS4oCa3
— V6 News (@V6News) January 6, 2024
కోటి దాటిన దరఖాస్తులు
శుక్రవారం నిర్వహించిన గ్రామసభల్లో 18,29,274 అభయహస్తం దరఖాస్తులు అందాయి. దీంతో, మొత్తం 1,08,94,115 దరఖాస్తులు అందాయి. అభయ హస్తంకు సంబంధించి 93,38,111 దరఖాస్తులు రాగా ఇతర అంశాలకు సంబంధించి 15, 55,704 అప్లికేషన్లు వచ్చాయి. చివరి రోజైన శనివారం కూడా భారీగా అప్లికేషన్లు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఆన్లైన్లోకి.. ప్రజాపాలన దరఖాస్తులుhttps://t.co/7wDKqESIHi#PrajaPalana #Online #applications #LatestNews #TeluguNews #SakshiNews #TrendingNews #LatestNewsToday
— Sakshi (@sakshinews) January 6, 2024
నాలుగు నెలలకు ఒకసారి..
ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన నిర్వహించేందుకు నిర్ణయించింది. ఇక గ్రామసభల్లో దరఖాస్తులు ఇవ్వలేని వారు తహసీల్దారు, ఎంపీడీవో, మున్సిపల్ కార్యాలయాల్లో కూడా ఇవ్వొచ్చని ప్రభుత్వం ప్రకటించింది. ఈ దరఖాస్తులకు సంబంధించి డాటా ఎంట్రీని ఈ నెల 17 లోగా పూర్తి చేయాలని సీఎస్ శాంతి కుమారి కలెక్టర్లను ఆదేశించారు.
(The above story first appeared on LatestLY on Jan 06, 2024 08:18 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

