Brazil Plane Crash: అమెజాన్ అడవుల్లో కుప్పకూలిన టూరిస్టు విమానం, 14 మంది మృతి అక్కడికక్కడే మృతి, ప్రమాద సమయంలో ఆ ప్రాంతంలో భారీగా వర్షం

బ్రెజిల్‌లోని అమెజాన్‌ అడవుల్లో ప్యాసింజర్‌ టూరిస్టు విమానం కూలిన ఘటనలో అందులోని మొత్తం 14 మందీ దుర్మరణం చెందారు. మనాస్‌ నుంచి బయలుదేరిన విమానం బర్సెలోస్‌ సమీపంలో కూలిందన్నారు

American Airlines Plane Engine Catches Fire (Photo-Video Grab)

బ్రెజిల్‌లోని అమెజాన్‌ అడవుల్లో  ప్యాసింజర్‌ టూరిస్టు విమానం కూలిన ఘటనలో అందులోని మొత్తం 14 మందీ దుర్మరణం చెందారు. మనాస్‌ నుంచి బయలుదేరిన విమానం బర్సెలోస్‌ సమీపంలో కూలిందన్నారు. ప్రమాద సమయంలో ఆ ప్రాంతంలో భారీగా వర్షం కురుస్తోందన్నారు. మృతుల్లో 12 మంది ప్రయాణికులు కాగా, ఇద్దరు విమాన సిబ్బంది అని అమెజొనాస్‌ రాష్ట్ర గవర్నర్‌ విల్సన్‌ లిమా చెప్పారు.

బ్రెజిల్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన అమెజాన్ అడవుల్లోని బార్సెలోస్‌ను సందర్శించేందుకు 14 మందితో కూడిన టూరిస్టు విమానం వాతావారణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో అడవుల్లో కుప్పకూలింది. భారీ వర్షంలో ప్రయాణిస్తున్న ఈ విమానం పైలట్ ఎదురుగా ఏమీ కలిపించకపోయిన అలాగే నడుపుకుంటూ వెళ్లారు. ఇదే క్రమంలో ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నించగా పరిస్థితులు అనుకూలించక విమానం అడవుల్లో కుప్పకూలిందని ఆమెజోనా స్టేట్ సెక్యూరిటీ సెక్రెటరీ వినిషియస్ అల్మెయిదా తెలిపారు. ప్రమాదానికి గురైన విమానం బ్రెజిలియన్ ఎయిర్‌క్రాఫ్ట్ మేకర్ ఎంబ్రేయర్ తయారు చేసిన ట్విన్-ఇంజన్ టర్బోప్రాప్ ఈఎంబీ-10గా గుర్తించారు.

Here's BBC News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now