Burundi Prison Fire: జైలులో ఘోర అగ్ని ప్రమాదం, 38 మంది ఖైదీలు సజీవ దహనం, 60 మందికిపైగా గాయాలు, ఆఫ్రికా దేశం బురిండీ రాజధాని గిటాగా జైలులో విషాద ఘటన
ఆఫ్రికా దేశం బురిండీలో పెను విషాదం చోటుచేసుకుంది. ఓ జైలులో సంభవించిన అగ్ని ప్రమాదంలో (Burundi Prison Fire) 38 మంది ఖైదీలు సజీవ దహనమయ్యారు. రాజధాని గిటాగా జైలులో ఈ ఘటన జరిగింది. నిన్న ఉదయం జైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఖైదీలను చుట్టుముట్టాయి. తప్పించుకునే మార్గం లేక ఖైదీలు మంటలకు ఆహుతయ్యారు.
Nairobi, December 7: ఆఫ్రికా దేశం బురిండీలో పెను విషాదం చోటుచేసుకుంది. ఓ జైలులో సంభవించిన అగ్ని ప్రమాదంలో (Burundi Prison Fire) 38 మంది ఖైదీలు సజీవ దహనమయ్యారు. రాజధాని గిటాగా జైలులో ఈ ఘటన జరిగింది. నిన్న ఉదయం జైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఖైదీలను చుట్టుముట్టాయి. తప్పించుకునే మార్గం లేక ఖైదీలు మంటలకు ఆహుతయ్యారు. మరో 60 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. వీరిలోనూ కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. నిజానికి ప్రమాదం సంభవించిన ఈ జైలులో ఖైదీల సామర్థ్యం 400 కాగా, 1500 మందికిపైగా ఖైదీలను కుక్కేశారు. ఫలితంగా ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నట్టు అధికారులు తెలిపారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)