China Fire: చైనాలో ఐదు అంతస్తుల భవనంలో ఘోర అగ్ని ప్రమాదం, 26 మంది అక్కడికక్కడే సజీవ దహనం, మరో 60 మందికి పైగా గాయాలు
ఈ ఘటనలో 19 మంది మరణించారు. ఉత్తర చైనాలోని షాంగ్జీ ప్రావిన్స్‌లోని లిషి జిల్లాలో లియులియాంగ్ నగరంలో ఉన్న ఐదు అంతస్తుల భవనంలో ఓ ప్రైవేటు బొగ్గు గని సంస్థ కార్యాలయం ఉంది.
చైనా (China)లో షాంగ్జీ ప్రావిన్స్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 26 మంది మరణించారు. ఉత్తర చైనాలోని షాంగ్జీ ప్రావిన్స్‌లోని లిషి జిల్లాలో లియులియాంగ్ నగరంలో ఉన్న ఐదు అంతస్తుల భవనంలో ఓ ప్రైవేటు బొగ్గు గని సంస్థ కార్యాలయం ఉంది. గురువారం ఉదయం సుమారు ఏడు గంటల ప్రాంతంలో భవనం రెండో అంతస్తులో మంటలు చెలరేగాయి. అవి మిగిలిన అంతస్తులకు వ్యాపించడంతో సుమారు 90 మంది సిబ్బంది భవనం లోపల చిక్కుకుపోయారు.
మంటల తీవ్రత పెరగడంతో భవనం లోపల ఉన్న వారిలో 26 మృతి చెందారు. మరో 60 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు ఘటనా స్థలికి చేరుకుని గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రి తరలించాయి. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టినట్లు స్థానిక అధికారులు తెలిపారు.
Here's Fire Video