Gas Explosion in Hubei Province: ఘోర అగ్ని ప్రమాదం, గ్యాస్ సిలిండర్ పేలడంతో 11 మంది మృతి, వందల మందికి తీవ్ర గాయాలు, చైనాలో షియాన్ నగరంలో విషాద ఘటన
ఓ భవనంలో గ్యాస్ సిలిండర్ పేలడంతో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో దాదాపు వందల మంది తీవ్రంగా గాయపడినట్టు సమాచారం.
మధ్య చైనా నగరంలోని హుబీ ప్రావిన్స్‌లోని షియాన్ నగరంలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ భవనంలో గ్యాస్ సిలిండర్ పేలడంతో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో దాదాపు వందల మంది తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. ఉదయం 6:30 గంటలకు జరిగిన ఈ ఘటనలో పేలుడు ధాటికి ఆహార మార్కెట్ భవనం కూలిపోయింది. ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న స్థానికులు, సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని శిథిలాల కింద చిక్కుకున్న 150 మందిని రక్షించారు. ఇక మిగతా వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు అధికారులు పేర్కొన్నారు. గాయపడిన వారిని షియాన్‌లోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్టు వెల్లడించారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)