China Cyber Espionage: చైనా మరో దుశ్చర్య, హ్యాకర్ల సాయంతో సరిహద్దులో భారత విద్యుత్‌ పంపిణీ కేంద్రాలపై హ్యాకింగ్‌

భారత సరిహద్దులో చైనా మరో దుశ్చర్యకు పాల్పడింది. హ్యాకర్ల సాయంతో సరిహద్దులో ఉన్న విద్యుత్‌ పంపిణీ కేంద్రాలపై హ్యాకింగ్‌కు పాల్పడే యత్నం చేసింది. ఈ విషయం ప్రైవేట్‌ ఇంటెలిజెన్స్‌ కంపెనీ ‘రికార్డెడ్‌ ఫ్యూచర్‌’ బయటపెట్టింది. లడఖ్‌ రీజియన్‌లోని పవర్‌ గ్రిడ్‌ లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు ధృవీకరించింది

power Grids

భారత సరిహద్దులో చైనా మరో దుశ్చర్యకు పాల్పడింది. హ్యాకర్ల సాయంతో సరిహద్దులో ఉన్న విద్యుత్‌ పంపిణీ కేంద్రాలపై హ్యాకింగ్‌కు పాల్పడే యత్నం చేసింది. ఈ విషయం ప్రైవేట్‌ ఇంటెలిజెన్స్‌ కంపెనీ ‘రికార్డెడ్‌ ఫ్యూచర్‌’ బయటపెట్టింది. లడఖ్‌ రీజియన్‌లోని పవర్‌ గ్రిడ్‌ లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు ధృవీకరించింది. గ్రిడ్ నియంత్రణ, విద్యుత్ పంపిణీ కోసం నిజ-సమయ(రియల్‌ టైం) కార్యకలాపాలను నిర్వహించేందుకు బాధ్యత వహించే కనీసం ఏడు ఇండియన్ స్టేట్ లోడ్ డెస్పాచ్ సెంటర్‌లను (SLDC) లక్ష్యంగా చైనా నెట్‌వర్క్ చొరబాట్లను గమనించాము. ముఖ్యంగా, ఈ లక్ష్యం లడఖ్‌లోని వివాదాస్పద భారత్-చైనా సరిహద్దుకు సమీపంలో ఉన్న SLDCతో భౌగోళికంగా కేంద్రీకృతమై ఉందని గుర్తించాం. ఆ హ్యాకింగ్‌ ప్రయత్నాలన్నీ చైనా అధికారిక సైబర్‌ సెంటర్ల నుంచి వచ్చినవే’ అంటూ బుధవారం ఒక ప్రకటన చేసింది రికార్డెడ్‌ ఫ్యూచర్‌ కంపెనీ.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement