Afghanistan Earthquake Update: ఎక్కడ చూసినా శవాల కుప్పలే.. అఫ్గాన్‌లో 2400 దాటిన భూకంప మృతుల సంఖ్య
అఫ్గానిస్థాన్‌లో (Afghanistan) శనివారం సంభవించిన భారీ భూకంపం (Earthquake) ఇప్పటివరకు 2,445 మందిని పొట్టనపెట్టుకున్నది.
Newdelhi, Oct 9: అఫ్గానిస్థాన్‌లో (Afghanistan) శనివారం సంభవించిన భారీ భూకంపం (Earthquake) ఇప్పటివరకు 2,445 మందిని పొట్టనపెట్టుకున్నది. దేశంలో ఎక్కడ చూసినా శవాల కుప్పలే దర్శనమిస్తున్నాయి. ఏ శిథిలాన్ని తొలగిస్తే ఎన్ని శవాలు బయటపడతాయోనని సహాయ బృందాలు భయపడుతున్నాయి. ఇప్పటివరకు 2,445 మంది మరణించారని, మరో 2 వేల గాయపడ్డారని అఫ్గాన్ విపత్తుల మంత్రిత్వశాఖ ప్రతినిధి జనన్ సయీక్ (Janan Sayeeq) తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. శనివారం మధ్యాహ్నం 6.3 తీవ్రతతో పశ్చిమ అఫ్గాన్‌లోని హెరాత్‌లో (Herat) భారీ భూకంపం వచ్చిన విషయం తెలిసిందే.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)