China Lockdown: చైనాను వణికిస్తున్న మరో ఫ్లూ.. లాక్‌డౌన్ యోచనలో ప్రభుత్వం.. వద్దేవద్దంటున్న ప్రజలు.. సోషల్ మీడియాలో ఫైర్

కరోనా వైరస్‌ వెలుగుచూసి.. అనంతరం కేసులతో కుదేలై.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పొరుగుదేశం చైనా ను ఇప్పుడు మరో ఫ్లూ వేధిస్తోంది. ఈ కొత్త ఫ్లూ కేసులు దేశవ్యాప్తంగా పెరుగుతుండడంతో ప్రభుత్వం లాక్‌డౌన్ యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

COVID-19 in China. (Photo Credits: IANS)

Beijing, March 13: కరోనా వైరస్‌ (Corona Virus) వెలుగుచూసి.. అనంతరం కేసులతో కుదేలై.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పొరుగుదేశం చైనా (china)ను ఇప్పుడు మరో ఫ్లూ వేధిస్తోంది. ఈ కొత్త ఫ్లూ (Flu) కేసులు దేశవ్యాప్తంగా పెరుగుతుండడంతో ప్రభుత్వం లాక్‌డౌన్ యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నెల మొదటి వారంలో 25.1శాతంగా ఉన్న కేసుల సంఖ్య ప్రస్తుతం 41.6 శాతానికి పెరిగింది. జియాన్ నగరంలో ఫ్లూ కేసులు పెరగడంతో వాణిజ్య ప్రాంతాలు, పాఠశాలలు, రద్దీ ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధించాలని ప్రభుత్వం యోచిస్తుండగా, అలాంటి పని చేయొద్దంటూ ప్రజలు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement