Mexico Shootings: రక్త పాతాన్ని సృష్టించిన క్రిస్మ‌స్ ముందస్తు వేడుక‌లు, 16 మంది మృతి, మరో 12 మందికి గాయాలు

మెక్సికోలో నిర్వ‌హించిన క్రిస్మ‌స్ ముందస్తు వేడుక‌ల్లో దుండ‌గులు జ‌రిపిన కాల్పుల్లో 16 మంది మృతి చెంద‌గా, మ‌రో 12 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. కాల్పులు జ‌రిపిన దుండ‌గుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. గ్వానాజువాటో రాష్ట్రంలోని స‌ల్వ‌టియేర్రా ప‌ట్ట‌ణంలో ఆదివారం రాత్రి క్రిస్మ‌స్ ముంద‌స్తు వేడుక‌లు నిర్వ‌హించారు.

Representational Image (File Photo)

మెక్సికోలో నిర్వ‌హించిన క్రిస్మ‌స్ ముందస్తు వేడుక‌ల్లో దుండ‌గులు జ‌రిపిన కాల్పుల్లో 16 మంది మృతి చెంద‌గా, మ‌రో 12 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. కాల్పులు జ‌రిపిన దుండ‌గుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. గ్వానాజువాటో రాష్ట్రంలోని స‌ల్వ‌టియేర్రా ప‌ట్ట‌ణంలో ఆదివారం రాత్రి క్రిస్మ‌స్ ముంద‌స్తు వేడుక‌లు నిర్వ‌హించారు. ఈ వేడుక‌లు టియేర్రా నెగ్రా ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో జ‌రిగాయి. అయితే ఓ ఆరుగురు వ్య‌క్తుల‌ను భ‌ద్ర‌తా కార‌ణాల దృష్ట్యా ఆ వేడుక‌కు నిర్వాహ‌కులు అనుమ‌తించ‌లేదు. దీంతో క్రిస్మ‌స్ వేడుక‌లు ముగిసిన అనంత‌రం అంద‌రూ బ‌య‌ట‌కు వ‌చ్చి త‌మ నివాసాల‌కు వెళ్తుండ‌గా, ఆ ఆరుగురు విచ‌క్ష‌ణార‌హితంగా కాల్పులు జ‌రిపారు.

Here's News

 

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement