Mohammed Deif Dead: హమాస్‌కు మరో షాక్, మాస్టర్‌మైండ్ ‘డెయిఫ్’ ను హతమార్చిన ఇజ్రాయెల్ బలగాలు, గాజా టన్నెల్ నెట్‌వర్క్ నిర్మాణం సూత్రధారి ఇతడే..
గాజాలోని ఖాన్ యూనిస్ ప్రాంతంలో జులై 13న జరిపిన దాడుల్లో అతడు హతమైన విషయాన్ని నిర్ధారించింది.
ఇజ్రాయెల్‌పై గతేడాది అక్టోబరు 7 నాటి మెరుపుదాడులకు ప్రధాన సూత్రధారిగా భావిస్తోన్న హమాస్ సైనిక విభాగాధిపతి (Military wing) మహమ్మద్ డెయిఫ్ (Mohammed Deif)ను అంతమొందించినట్లు టెల్ అవీవ్ ప్రకటించింది. గాజాలోని ఖాన్ యూనిస్ ప్రాంతంలో జులై 13న జరిపిన దాడుల్లో అతడు హతమైన విషయాన్ని నిర్ధారించింది.డెయిఫ్ లక్ష్యంగా గాజాలో చేసిన దాడిలో అతడు ప్రాణాలు కోల్పోయినట్లు తమ నిఘా విభాగం అంచనాకు వచ్చిందని వెల్లడించింది.హమాస్ బాంబుల తయారీ నిపుణుడు అయ్యాష్‌కు ఇతను సన్నిహితుడు.ఇజ్రాయెల్ దళాలకు తలనొప్పిగా మారిన గాజా టన్నెల్ నెట్‌వర్క్ నిర్మాణం వెనుక మాస్టర్ మైండ్ కూడా అతడే. ఇజ్రాయెల్ దళాలకు చిక్కకుండా ఎక్కువ సమయం ఆ సొరంగాల్లోనే గడుపుతాడని సమాచారం. హమాస్ మిలిటెంట్ గ్రూపుకు భారీ షాక్, వైమానికి దాడిలో పొలిటికల్ చీఫ్ ఇస్మాయిల్ హనియా మృతి
Here's News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)