Morocco Earthquake: మొరాకో విలయం.. 2 వేలు దాటిన భూకంప మృతులు.. గాయపడిన వారిలో 1,404 మంది పరిస్థితి విషమం
మరో 2 వేల మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు.
Vijayawada, Sep 10: మొరాకో భూకంప విలయంలో (Morocco Earthquake) ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 2 వేలు దాటింది. మరో 2 వేల మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. ఇప్పటి వరకు 2,012 మంది ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు చెబుతున్నారు. గాయపడిన 2,059 మందిలో 1,404 మంది పరిస్థితి విషమంగా ఉందని, దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఆఫ్రికా ఖండం ఉత్తరభాగం చరిత్రలో ఇంత పెద్ద భూకంపం (Earthquake) ఇదే తొలిసారని చెబుతున్నారు. తీర ప్రాంత నగరాలైన రబాత్, కాసాబ్లాంకా, ఎస్సౌయిరాలో బలమైన ప్రకంపనలు సంభవించినట్టు పేర్కొన్నారు. భూకంప కేంద్రం అల్‌హౌజ్ ప్రావిన్స్‌లోని ఇఘిల్ పట్టణ సమీపంలో, మర్రకేశ్‌కు దక్షిణాన దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో భూమిలో 18 కిలోమీటర్ల లోతున ఉన్నట్టు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)