North Korea: ఉత్తర కొరియాలో దారుణం, పక్కదేశం సినిమాలు చూశారని ఇద్దరి విద్యార్థులను ప్రజల మధ్యనే కాల్చి చంపిన కిమ్ జోంగ్ ఉన్ ప్రభుత్వం
ఉత్తర కొరియాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పొరుగు దేశమైన దక్షిణ కొరియా సినిమాలు చూశారని ఇద్దరు హైస్కూల్ విద్యార్థులకు ఆ దేశ ప్రభుత్వం మరణశిక్ష విధించింది. రేడియో ఫ్రీ ఆసియా నివేదిక ఈ వివరాలను బయటకు తెచ్చింది.
ఉత్తర కొరియాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పొరుగు దేశమైన దక్షిణ కొరియా సినిమాలు చూశారని ఇద్దరు హైస్కూల్ విద్యార్థులకు ఆ దేశ ప్రభుత్వం మరణశిక్ష విధించింది. రేడియో ఫ్రీ ఆసియా నివేదిక ఈ వివరాలను బయటకు తెచ్చింది. దాని ప్రకారం..ఉత్తర కొరియాకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఇటీవల చైనా సరిహద్దుకు సమీపంలో ఉన్న ర్యాంగ్ రాంగ్ ప్రావిన్స్‌కు వెళ్లారు.
అక్కడ దక్షిణ కొరియా దేశానికి చెందిన సినిమాలను, అమెరికన్ నాటకాన్ని చూశారు. వీటిని తోటి విద్యార్థులకు షేర్ చేశారు. దాంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రభుత్వం వారిద్దరినీ ప్రజల మధ్య కాల్చి చంపాలని ఆదేశాలు జారీ చేసింది. వీరిద్దర్నీ హెసాన్ నగరంలో జనం చూస్తుండగానే బహిరంగంగా పోలీసులు కాల్చి చంపారని రేడియో ఫ్రీ ఆసియా నివేదిక తెలిపింది.
Here's India Today Report
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)