Coronavirus Scare: కరోనాతో పోరాడుతున్న ఇండియాకు సంఘీభావం ప్రకటించిన పాకిస్తాన్, కోవిడ్ నుంచి భారత్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపిన ప్రధాని ఇమ్రాన్ ఖాన్
కరోనా మహమ్మారిపై పోరాడుతోన్న భారత్‌కు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ సంఘీభావం ప్రకటించారు. కరోనా నుంచి భారత్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచమంతా ఏకమై మహమ్మారిపై పోరాడాలని ఇమ్రాన్ ఖాన్ పిలుపునిచ్చారు.
ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతంగా ఉన్న ఈ సమయంలో తాము భారత ప్రజల కోసం ప్రార్థిస్తున్నామని పాకిస్థాన్ సమాచార శాఖ మంత్రి ఫవద్ హుస్సేన్ కూడా ప్రకటించారు ఈ కష్ట సమయంలో మా భారత ప్రజల కోసం మేము ప్రార్థిస్తున్నాం. దేవుడు దయ చూపాలి. త్వరలోనే ఈ కష్టాలు తొలగిపోవాలి అని ఆయన శనివారం ట్వీట్ చేశారు.
ఇండియాలో కరోనా కేసులు రోజుకో రికార్డు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. గడిచిన 24 గంటల్లో ఏకంగా 3.42 లక్షల కేసులు నమోదయ్యాయి. అటు పాకిస్థాన్‌లోనూ కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కరోనా మహమ్మారి విరుచుకుపడినప్పటి నుంచీ ఎప్పుడూ లేని విధంగా పాకిస్థాన్‌లో ఒకే రోజులో 157 మంది మృత్యువాత పడ్డారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)