Russia-Ukraine Crisis: ఉక్రెయిన్‌పై రష్యా బాంబుల వర్షం, రష్యాను నిలువరించేందుకు ప్రపంచ దేశాలు ముందుకు రావాలని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్‌స్కీ వినతి
రష్యాను నిలువరించేందుకు ప్రపంచ దేశాలు ముందుకు రావాలని జెలెన్‌స్కీ విజ్ఞప్తి చేశారు. రష్యాకు వ్యతిరేకంగా తాము పలు దేశాలతో మద్దతు కూడగడుతున్నామని ఆయన తెలిపారు.
ఉక్రెయిన్‌పై దాడుల నేపథ్యంలో ఆ దేశ ప్రెసిడెంట్ జెలెన్‌స్కీ స్పందించారు. రష్యాను నిలువరించేందుకు ప్రపంచ దేశాలు ముందుకు రావాలని జెలెన్‌స్కీ విజ్ఞప్తి చేశారు. రష్యాకు వ్యతిరేకంగా తాము పలు దేశాలతో మద్దతు కూడగడుతున్నామని ఆయన తెలిపారు. అమెరికా, యూరోపియన్ యూనియన్, బ్రిటన్, జర్మనీ, పోలాండ్ దేశాల అధ్యక్షులతో ఉక్రెయిన్ ప్రెసిడెంట్ ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు. పుతిన్ వ్యతిరేకంగా సంకీర్ణ కూటమిని ఏర్పాటు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కాగా ఉక్రెయిన్‌పై రష్యా బాంబుల వర్షం కురిపిస్తున్నది. అయితే రష్యా దాడిని ఉక్రెయిన్ సైనికులు ధీటుగా స్పందిస్తున్నారు. లుహాన్స్ రీజియన్‌లో రష్యాకు చెందిన ఐదు యుద్ధ విమానాలు, ఓ హెలికాప్టర్‌ను కూల్చివేశామని ఉక్రెయిన్ సైన్యం ప్రకటించింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)