Senegal Hospital Fire: ఘోర విషాదం, మంటల్లో మాడి మసైపోయిన 11 మంది నవజాత శిశువులు, ఆసుపత్రిలో షార్ట్​ సర్క్యూట్​ కారణంగా మంటలు, ఆఫ్రికా దేశం సెనెగల్‌లో విషాద ఘటన

ఓ ఆసుపత్రిలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 11 మంది నవజాత శిశువులు మృతిచెందారు. ఈ విషాదకర ఘటన ఆఫ్రికన్‌ దేశమైన సెనెగల్‌లో చోటుచేసుకుంది. సెనెగల్​లోని టివయూనే సిటీలో ఉన్న మేమ్ అబ్దు అజీజ్ సై దబాఖ్ ఆసుపత్రిలో షార్ట్​ సర్క్యూట్​ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ అగ్ని ప్రమాదంలో పిల్లల వార్డులో మంటలు చెలరేగి 11 మంది నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోయారు.

Representational image | Photo Credits: Flickr

ఓ ఆసుపత్రిలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 11 మంది నవజాత శిశువులు మృతిచెందారు. ఈ విషాదకర ఘటన ఆఫ్రికన్‌ దేశమైన సెనెగల్‌లో చోటుచేసుకుంది. సెనెగల్​లోని టివయూనే సిటీలో ఉన్న మేమ్ అబ్దు అజీజ్ సై దబాఖ్ ఆసుపత్రిలో షార్ట్​ సర్క్యూట్​ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ అగ్ని ప్రమాదంలో పిల్లల వార్డులో మంటలు చెలరేగి 11 మంది నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోయారు. అక్కడున్న సిబ్బంది అతికష్టం మీద ముగ్గురు చిన్నారుల్ని మాత్రమే కాపాడగలిగారు. ఈ ప్రమాద ఘటన విని దేశ అధ్యక్షుడు మ్యాకీ సాల్ తీవ్ర దిగ్బ్రాంతికి లోనైనట్టు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మృతుల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. దేశంలో మూడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించారు. కాగా, అంతకుముందు కూడా సెనెగల్‌లో ఇలాంటి అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. గడేదాడి లింగూరీలో ఓ ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంలో నలుగురు శిశువులు చనిపోయారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now